Inter Exams | రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు షురూ..
Ts Inter Exams
2/43
Inter Exams | రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు (Ts Intermediate Exams) ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష జరగనుంది. దీంతో ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు.
3/43
నిమిషం నిబంధన అమలులో ఉండటంతో విద్యార్థులు ఉరుకులు పరుగుల మీద ఎగ్జామ్ హాలుకు చేరుకున్నారు. ఉదయం 9 గంటల తర్వాత పరీక్షా కేంద్రానికి వచ్చిన విద్యార్థులను అధికారులను అనుమతించలేదు.
4/43
కాగా, ఇంటర్ పరీక్షల (Inter Exams) కోసం రాష్ట్రవ్యాప్తంగా 1473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9.47 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.
5/43
ఈసారి ఇంటర్ పరీక్షలు (Inter Exams) అత్యధిక మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో రాస్తున్నారు. 9.47 లక్షల మంది విద్యార్థుల్లో 8.40 లక్షల మంది ఇంగ్లిష్ మీడియంలోనే హాజరవుతున్నారు.
6/43
ఫస్టియర్‌లో 4.32 లక్షలు, సెకండియర్‌లో 4.09 లక్షలు ఇంగ్లిష్ మీడియంలో రాస్తుండగా, తెలుగు మీడియం ఫస్టియర్‌లో 45,376, సెకండియర్‌లో 50,673 విద్యార్థులు హాజరుకాబోతున్నారు.
7/43
ఉర్దూ మీడియంలో ఫస్టియర్‌లో 4,544, సెంకడియర్‌లో 4,667 విద్యార్థులు హాజరవుతున్నారు. మరాఠీలో 198, హిందీలో 70, కన్నడలో 18 మంది పరీక్షలు రాయనున్నారు.