ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడులను మరింత బలోపేతం చేసే, విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు పాఠశాల విద్యాశాఖ పటిష్ఠ కార్యాచరణను సిద్ధం చేసింది.
9/20
నూతన విద్యాసంవత్సరంలో చేపట్టే కార్యక్రమాలతో పాఠశాల విద్య, సమగ్ర శిక్ష, స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ (సైట్)లకు అధికారులు వేర్వేరు ప్రణాళికలను రూపొందించారు.
10/20
వాటిని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి (Minister Sabitha Indrareddy), విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు సమర్పించి ఆమోదం తీసుకున్నారు.
11/20
నిరుడు 1-8 తరగతుల్లో ఆంగ్ల మాధ్యమ బోధనను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఈసారి దాన్ని 9వ తరగతికి విస్తరించనున్నది.