Sita Rama Kalyanam | వేములవాడ టౌన్, మార్చి 27: దక్షిణకాశిగా ప్రసిద్ధి చెంది, హరిహరక్షేత్రంగా భాసిల్లుతున్న వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది.

వేదమంత్రాల సాక్షిగా చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, అభిజిత్ లగ్నంలో ఈ కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా సాగింది.

ఆలయ సంప్రదాయం ప్రకారం దేవస్థానం తరఫున ఈవో రమాదేవి, ఆలయ అధికారులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకను తిలకించేందుకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. వేములవాడ క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది.

పెద్ద సంఖ్యలో తరలివచ్చిన శివపార్వతులు దేవుని పెళ్లిని తమ పెళ్లిగా భావించి జీలకర్ర-బెల్లం తలపై ఉంచుకొని తలంబ్రాలు పోసుకున్నారు. ఈ దృశ్యాలు చూసిన ఇతర భక్తులు భక్తి తన్మయత్వం చెందారు.

సీతారాముల కల్యాణం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాజన్న ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

గత సంవత్సరం కంటే భిన్నంగా ఈ సంవత్సరం రాజన్న ఆలయ చెరువులోని శివార్చన వేదికపై వేసిన కల్యాణ మంటం చుట్టూ అందమైన పుష్పాలతో, రంగురంగుల లేలేత ఆకులతో అందంగా అలంకరించారు. ఆలయ కల్యాణ వేదిక కింద షామియానాలు ఏర్పాటు చేశారు. భక్తులకు తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉదయం 7 గంటలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తరఫున బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, ఆలయం తరఫున ఈవో రమాదేవి, మున్సిపల్ తరఫున కమిషనర్ సంపత్ కుమార్, చైర్మన్ పుల్కం రాజు ప్రజాప్రతినిదులు పట్టువస్త్రాలు సమర్పించారు.

కల్యాణానికి గురువారం రాత్రే లక్షకు పైగా భక్తులు చేరుకోగా, శుక్రవారం జరిగిన ప్రధాన వేడుకకు లక్షన్నర మందికి పైగా భక్తులు హాజరైనట్లు ఆలయ అధికారులు తెలిపారు.

వేములవాడ క్షేత్రంలో సీతారాముల కల్యాణం నిర్వహించడం అనాదిగా వస్తోంది. ముందుగా రాజన్న అనుబంధ దేవాలయంలోని మూలమూర్తికి పాద ప్రక్షాళన మధుపర్కం, జీలకర్ర బెల్లం, కన్యాదానం, మాంగళ్యధారణ, అక్షతారోపణం, బ్రహ్మముడి, హారతి వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం 10.30 గంటలకు సీతారాముల విగ్రహాలను కల్యాణ వేదికకు పల్లకిలో తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. వధూవరులను ఆహ్వానించి, గోత్రప్రవరాలు చెప్పి వివాహ తంతు నిర్వహించారు. వేదపండితులు, అర్చకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కన్యాదాతలుగా మరంగంటి విజయసారథి-కరుణ దంపతులు వ్యవహరించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా సుమారు 76 వేల రూపాయలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

వేలాదిమంది భక్తులు దేవుని కల్యాణాన్ని తిలకించి, జీలకర్ర-బెల్లం తలపై ఉంచుకొని తలంబ్రాలు పోసుకున్నారు. జోగినీలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

వేములవాడలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం.. చిత్రాలు