Apps:
Follow us on:

Hyderabad | జీహెచ్‌ఎంసీ రహదారులపై హెచ్ఎండీఏ పూలబాటలు

రూ.15.04 కోట్ల వ్యయంతో వరంగల్‌ హైవే (ఎన్‌హెచ్‌-165) వెంట 64 కిలోమీటర్లు, రూ.3.57 కోట్ల వ్యయంతో నాందేడ్‌ హైవే (ఎన్‌హెచ్‌-161) వెంట 33 కిలోమీటర్లు సెంట్రల్‌ మిడెన్‌ గ్రీనరీ, మల్టీ లేయర్‌ ప్లాంటేషన్‌ పనులను హెచ్‌ఎండీఏ పూర్తి చేసింది.
2/8హైదరాబాద్‌ మహానగరం నుంచి నలువైపులా ఉన్న జాతీయ రహదారులు పూల బాటలుగా మారుతున్నాయి.
3/8ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)జాతీయ రహదారులకు ఇరువైపులా పచ్చదనం, ఫ్లైఓవర్‌బ్రిడ్జిలు, మెట్రో కారిడార్లు, ఏకో పారుల ఏర్పాట్లలో ప్రధాన భూమిక పోషిస్తున్నది.
4/8శ్రీశైలం హైవే (ఎన్‌హెచ్‌-765) వెంట 18 కిలోమీటర్లు, కరూలు హైవే (ఎన్‌హెచ్‌-44) వెంట 25 కిలోమీటర్లు, రాజీవ్‌ రహదారి స్టేట్‌ హైవే (ఎస్‌హెచ్‌-1) వెంట 39 కిలోమీటర్లు సెంట్రల్‌ మిడెన్‌ గ్రీనరీ, మల్టీ లేయర్‌ ప్లాంటేషన్‌ నిర్వహణ చేపట్టారు.
5/8ముఖ్యంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహాస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసిన నేపథ్యంలో వరంగల్‌ నేషనల్‌ హైవే (163)వెంట గ్రీనరీ పెంపుదలకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
6/8సానుకూల స్పందన రాకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరంగల్‌ హైవే వెంట గ్రీనరీ పెంపుదల బాధ్యతలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రికి సూచించారు.
7/8తొలి దశలో వరంగల్‌ హైవే గ్రీనరీ బ్యూటిఫికేషన్‌ పనులను రూ.5.5 కోట్ల అంచనాలతో దాదాపు 30 కిలోమీటర్ల పొడవున ఘట్‌కేసర్‌ నుంచి రాయగిరి వరకు నేషనల్‌ హైవే సెంట్రల్‌ మిడెన్‌ గ్రీనరీ బ్యూటిఫికేషన్‌ పనులు మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ అర్వింద్‌ కుమార్‌ పర్యవేక్షణలో పూర్తి అయ్యాయి.
8/8ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో ‘మల్టీలేయర్‌ ప్లాంటేషన్‌’ వరంగల్‌ వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
9/8గ్రీనరీ బ్యూటిఫికేషన్‌ పనులు పూర్తి కావడంతో వరంగల్‌ రహదారి వెంట అకు పచ్చని అందాలు అందరికీ కనువిందు చేస్తున్నాయి.