Dr Br Ambedkar Telangana State Secretariat
2019 జూన్ 27న సచివాలయం (Secretariat) భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ (CM KCR) భూమిపూజ, శంకుస్థాపన చేశారు.
సచివాలయ (Secretariat) నిర్మాణానికి డాక్టర్ ఆ సార్, పొన్ని కాన్సెస్సావో అనే ప్ర ఖ్యాత ఆరిటెక్టులు డిజైనర్లుగా వ్యవహరించారు.
సీఎం కేసీఆర్ (CM KCR) ఆమోదించిన ప్రస్తుత నమూనాతో నూతన సచివాలయం (New Secretariat) రూపుదిద్దుకున్నది. నూతన సచివాలయాన్ని (New Secretariat) షాపూర్ జీ పల్లోంజి అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించింది.
కరోనా, కోర్టు కేసులు, ఇతర పరిస్థితుల నేపథ్యంలో నూతన సచివాలయ భవన నిర్మాణ పనులు 2021 జనవరిలో ప్రారంభమయ్యాయి.
పనులు మొదలయ్యాక 26 నెలల రి కార్డు సమయంలో నిర్మాణం పూర్తి చే శారు. ఇంత భారీ నిర్మాణానికి సాధారణంగా ఐదేండ్లయినా పడుతుంది.
సచివాలయం (New Secretariat)లోకి ప్రవేశానికి స్మార్ట్‌కార్డ్‌తో కూడిన పాస్‌లు జారీ చేశారు. 300 సీసీ కెమెరాలు, 300 మంది పోలీసులతో నిఘా ఏర్పాటుచేశారు.
కొత్త భవనంలో అత్యుత్తమ సాంకేతికత వినియోగం ద్వారా ఆన్‌లైన్‌లో పాలన. డోమ్‌లు, పిల్లర్ల నిర్మాణం కోసం గాల్వనైజ్డ్ రీఇన్ఫోర్స్ కాంక్రీట్ (జీఆర్ సీ) టెక్నాలజీని వినియోగించారు.
ఈ విధానం లో పిల్లర్ల తయారీకే 6 నెలల సమయం పట్టింది. రోజూ 3 వేల మందికి పైగా కార్మికులు పనిచేశారు.
మొత్తం 1000 లారీల రెడ్ శాండ్‌స్టోన్ వినియోగించారు. భవన నిర్మాణానికి రూ.617 కోట్ల మే ర పరిపాలన అనుమతులు వచ్చాయి.
అప్పట్లో 6 శాతంగా ఉన్న జీఎస్టీ తర్వాత 18 శాతానికి పెరిగింది. నిర్మాణ సామగ్రి ధరలు పెరిగాయి. కరోనా కారణంగా కార్మికుల వేతనాలు పెరిగాయి.
దీంతో నిర్మాణ వ్యయం దాదాపు 30 శాతానికి పైగా పెరిగింది. ఆరు అంతస్తులతో నిర్మించిన సచివాలయంలో 635 గదులు ఉన్నాయి.
ప్రత్యేకంగా 30 కాన్ఫరెన్స్ హాళ్లను ఏర్పాటు చేశారు. ఇకడి నుంచే క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించవచ్చు.
ఏసీ కోసం ప్రత్యేక ప్లాంట్‌నే నెలకొల్పారు. కరెంట్ పొదుపునకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు నిర్ణయించారు.
24 లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు. 5.60 లక్షల లీటర్ల నీరు నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో రెండున్నర ఎకరాల్లో భవనాన్ని నిర్మించారు.
రెండు బ్యాంకులు, పోస్ట్‌ఆఫీస్, ఏటీఎమ్ సెంటర్లు, రైల్వే కౌంటర్, బస్ కౌంటర్, క్యాంటీన్ ఉన్నాయి.
వెనుకవైపు ఉద్యోగుల అసోసియేషన్, ఇండోర్ గేమ్స్, హౌసింగ్ సొసైటీ కార్యాలయాల కోసం నాలుగు అంతస్తులతో ఒక బిల్డింగ్ ను నిర్మించారు.
సచివాలయానికి ఆగ్నేయంగా గుడి, మసీదు, చర్చిలను నిర్మించారు. వాటి పకనే ముందువైపు రిసెప్షన్ హాల్, ఎ న్‌ఆర్‌ఐ సెంటర్, పబ్లిసిటీ సెల్ పకనే మీడియా కోసం గదులు నిర్మించారు.
ఆరో అంతస్తుపైన డోమ్‌కు మధ్య 4,500 చదరపు అడుగుల చొప్పున రెండు అంతస్తులను నిర్మించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చే వీఐపీలు, విదే శీ అతిథుల కోసం వీటిని వినియోగిస్తారు.
వీటిలో పర్షియన్ మాడల్‌లో రాయల్ డైనింగ్ హాల్స్ ఉన్నాయి. సచివాలయానికి మొత్తం 4 ద్వారాలుండగా.. తూర్పు వైపు ఉన్న ప్రధాన ద్వారం నుంచి సీఎం, సీఎస్, డీజీపీ, మంత్రులు, ప్రజాప్రతినిధులు వస్తారు.
పడమర వైపు ద్వారాన్ని అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తారు. ఈశాన్య గేటు నుంచి అన్ని శాఖల ఉద్యోగులు వస్తారు. ఆగ్నేయ ద్వారం నుంచి సందర్శకులు వస్తారు.
స్కెలాంజ్ నుంచి నగర అందాలను 360 డిగ్రీల కోణంలో వీక్షించవచ్చు. పార్లమెంటు భవనానికి వినియోగించిన ధోల్ పూర్ ఎర్రరాయిని సచివాలయం కోసం 3,500 క్యూ.మీ. పరిమాణంలో వాడారు.
ఇందుకు రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ లో ఏకంగా ఓ గని మొత్తాన్ని వినియోగించారు. అకడి నుంచి వేయి లారీల్లో రాయిని హైదరాబాద్‌కు తరలించారు.
బేస్ మెంట్ మొత్తానికి ఎర్ర రాయిని వాడగా, ప్రధాన గుమ్మటం నుంచి పోర్టికో వరకు లేత గోధుమ రంగు రాయిని వాడారు.
ప్రధాన పోర్టికో ఎత్తు ఏకంగా 42 అడుగులు. అంత ఎత్తుతో భారీ స్తంభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ భవనంలో ప్రతి అంతస్తు 14 అడుగుల ఎత్తుతో నిర్మించారు.
భవనంలో మొత్తం 24 లిఫ్టులు ఏర్పాటు చేశారు. సై లాంజ్ వరకు వెళ్లేందుకు రెండు వైపులా 4 లిఫ్టుల చొప్పున 8 లిఫ్టులున్నాయి.
మొత్తం భూ విస్తీర్ణం : 28 ఎకరాలు, భవనం నిర్మించిన ఏరియా : 2.5 ఎకరాలు, ల్యాండ్ సేపింగ్ : 7.72 ఎకరాలు, సెంట్రల్ కోర్ట్ యార్డ్ లాన్ : 2.2 ఎకరాలు.
పారింగ్ : 560 కార్లు, 700ల బైక్‌లు, యాన్సిలరీ బిల్డింగ్ ఏరియా : 67,982 చ.అ., ప్రధాన భవన కాంప్లెక్స్ బిల్టప్ ఏరియా : 8,58,530 చ.అ.
లోయర్ గ్రౌండ్ + గ్రౌండ్ + ఆరు అంతస్థుల్లో, ఒకోదాని ఎత్తు : 14 అడుగులు, అశోక చిహ్నం మొత్తం ఎత్తు : 265 అడుగులు.
భవనం పొడవు, వెడల్పు : 600 X 300, ప్రధాన గుమ్మటాలు (సైలాంజ్) : 11వ అంతస్థు
ప్రధాన రెండు గుమ్మటాలపై 18 అడుగుల ఎత్తులో జాతీయ 4 సింహాల చిహ్నాలను ఏర్పాటుచేశారు. 5 అడుగుల ఎత్తు, 2.5 టన్నుల బరువుండే చిహ్నాలను ఢిల్లీలో తయారు చేయించారు.
సచివాలయ భూగర్భంలో 2.5 లక్షల లీటర్ల సామర్థ్యంతో మినీ రిజర్వాయర్ నిర్మించారు. భవనం నలువైపుల నుంచి వాన నీటిని రిజర్వాయర్‌లోకి తరలించేందుకు ప్రత్యేక పైప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రాంగణంలోని 9 ఎకరాల పచ్చిక బయళ్ల నిర్వహణకు ఈ నీటినే వాడుతారు.
ఆరో అంతస్థులో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటైంది. పూర్తిగా తెల్లటి మార్బుల్‌తో ముఖ్యమంత్రి కార్యాలయం, ఆయన సిబ్బందికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటుచేశారు.
ముఖ్యమంత్రి ప్రజలను కలిసేందుకు, ప్రజాదర్బారు నిర్వహించేందుకు జనహిత పేరిట కనీసం 250 మంది కూర్చునేలా ఒక హాలును ఏర్పాచేశారు.
25 మంది మంత్రులు, 30 మందికి పైగా అధికారులు కూర్చునేందుకు వీలుగా క్యాబినెట్ హాలును సిద్ధం చేశారు.
కలెక్టర్లతో సమావేశాల నిర్వహణ కోసం 60 మంది కూర్చునేలా ఒక హాలు, 50 మంది సమావేశమయ్యేందుకు మరో హాలును నిర్మించారు.
ఈ నాలుగు మందిరాలతో పాటు ముఖ్యమంత్రి విశిష్ట అతిథులతో కలిసి భోజనం చేసేందుకు.. సుమారు 25 మంది ఆసీనులయ్యేలా అత్యాధునిక డైనింగ్ హాలును ఏర్పాటు చేశారు.
నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేదర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని నామకరణం చేసిన సీఎం కేసీఆర్
ప్రతిష్టాత్మక ఐజిబిసి గుర్తింపు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజిబిసి) నుంచి గోల్డెన్ సర్టిఫికెట్ పొందిన ఏకైక సచివాలయం డాక్టర్ బీఆర్ అంబేదర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం.
గ్రౌండ్ ఫ్లోర్ : ఎస్సీ, మైనార్టీ, లేబర్, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖలు, 1వ అంతస్థు: ఎడ్యుకేషన్, పంచాయతీ రాజ్, హోంశాఖలు.
2వ అంతస్థు: ఫైనాన్స్, హెల్త్, ఎనర్జీ, పశు సంవర్థక శాఖలు, 3వ అంతస్థు: మున్సిపల్, ఐటీ, ఇండస్ట్రియల్ అండ్ కామర్స్, ప్లానింగ్, మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం, వ్యవసాయం
4వ అంతస్థు: ఫారెస్ట్, లా, ఇరిగేషన్, బీసీ వెల్ఫేర్, పౌర సరఫరాలు, యువజన సర్వీసులు-సాంస్కృతిక శాఖలు
5వ అంతస్థు: ఆర్ అండ్ బీ, సాధారణ పరిపాలన శాఖలు
6వ అంతస్థు: సీఎం, సీఎస్, సీఎంవో ఉన్నతాధికారులు, పీఆర్వో, సిబ్బంది కార్యాలయాలు.
Dr Br Ambedkar Telangana State Secretariat
Dr Br Ambedkar Telangana State Secretariat
Dr Br Ambedkar Telangana State Secretariat
Dr Br Ambedkar Telangana State Secretariat
Dr Br Ambedkar Telangana State Secretariat
Dr Br Ambedkar Telangana State Secretariat
Dr Br Ambedkar Telangana State Secretariat
Dr Br Ambedkar Telangana State Secretariat
Dr Br Ambedkar Telangana State Secretariat
Dr Br Ambedkar Telangana State Secretariat
Dr Br Ambedkar Telangana State Secretariat
Dr Br Ambedkar Telangana State Secretariat
Dr Br Ambedkar Telangana State Secretariat