గురువారం 04 మార్చి 2021
Gadwal - Sep 04, 2020 , 06:07:49

జూరాలకు పెరిగిన వరద

జూరాలకు పెరిగిన వరద

  •  గేట్‌ ద్వారా దిగువకు వరద నీరు
  •  48,000 క్యూసెక్కులు
  • టీబీ డ్యాంకు స్థిరంగా వరద
  • 884.90 అడుగులకు చేరిన ‘శ్రీశైలం’

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పెరిగింది. గురువారం జూరాల ప్రాజెక్టుకు 48,000 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, అవుట్‌ఫ్లో 43,528 క్యూసెక్కులు నమోదైంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని ఒక క్రస్ట్‌ గేటు ద్వారా వరద నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతోపాటు పవర్‌ హౌస్‌, కుడి, ఎడమ కాల్వల ద్వారా విడుదల చేస్తున్నారు. పవర్‌ హౌస్‌కు 37,404 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటి మట్టం 1045 అడుగులకుగానూ ప్రస్తుతం 1045 అడుగులకు చేరుకుంది. 9.657 టీఎంసీల నీటి మట్టానికి గానూ అదే స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 48,922 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 48,922 ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1705 అడుగులకు గానూ ప్రస్తుతం 1704.72 అడుగులకు చేరింది. 129.72 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఆల్మట్టిలో ప్రస్తుతం 128.190 టీఎంసీలు నమోదైంది. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 45,947 ఇన్‌ఫ్లో ఉండగా, అవుట్‌ఫ్లో 45,756 క్యూసెక్కులు నమోదైంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1615 అడుగులకు గానూ 1614.760 అడుగుల నీటి మట్టం నిల్వ ఉంది. 37.640 టీఎంసీలకు గానూ 37.460 టీఎంసీల నీటి నిల్వను ఉంచుతున్నారు. 

టీబీ డ్యాంకు స్థిరంగా వరద

అయిజ: కర్ణాటకలోని టీబీ డ్యాంకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. ఎగువన ఓ మోస్తారులో కురుస్తున్న వర్షాలకు వరద నీరు చేరుతోంది. గురువారం టీబీ డ్యాంలోకి ఇన్‌ఫ్లో 10,218 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 9,737 క్యూసెక్కులు ఉంది. ఎల్‌ఎల్‌సీ, హెచ్‌ఎల్సీ, కర్ణాటక కాల్వలకు సాగునీటిని విడుదల చేస్తున్నారు. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 100.586 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633అడుగుల నీటి మట్టానికి గానూ 1632.930 అడుగులు ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్‌ అధికారి విశ్వనాథ్‌ తెలిపారు.

ఆర్డీఎస్‌ ఆనకట్టకు కొనసాగుతున్న వరద..

ఆర్డీఎస్‌ ఆనకట్టకు గురువారం 5,455 క్యూసెక్కులు ఇన్‌ ఫ్లో ఉండగా, 5వేల క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరింది. ఆర్డీఎస్‌ ఆయకట్టుకు 455 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్‌ ఈఈ రామయ్య తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్‌ ఆనకట్టలో 8.7అడుగుల నీరు నిల్వ ఉన్నది.

శ్రీశైలానికి నిలకడగా వరద 

శ్రీశైలం : జూరాల ప్రాజెక్ట్‌ నుంచి 41,594 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా గురువారం సాయంత్రానికి నీటిమట్టం 884.90 అడుగుల వరకు చేరుకోగా రిజర్వాయర్‌ నీటినిల్వ 215.3263 టీఎంసీలుగా నమోదైంది. 32,839 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరినట్లు అధికారులు వెల్లడించారు. 


VIDEOS

logo