శనివారం 04 ఏప్రిల్ 2020
Gadwal - Feb 02, 2020 , 23:10:44

రాష్ట్రస్థాయి అబాకస్‌ పోటీలకు సరస్వతి పాఠశాల విద్యార్థులు

రాష్ట్రస్థాయి అబాకస్‌ పోటీలకు సరస్వతి పాఠశాల విద్యార్థులు

ఎర్రవల్లిచౌరస్తా : ఎర్రవల్లి చౌరస్తాలోని సరస్వతి పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి అబాకస్‌ పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల కరస్పాండెంట్‌ గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం జడ్చర్లలో నిర్వహించిన అబాకస్‌ పోటీలలో తమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారన్నారు. సీనియర్‌ విభాగంలో 5వ తరగతి చదువుతున్న ఉరుకుంద జిల్లాస్థాయిలో మొదటి బహుమతి పొందగా, జూనియర్‌ విభాగంలో 4వ  తరగతి చదువుతున్న భాస్కర్‌ జిల్లా స్థాయిలో మొదటి బహుమతి సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను శ్రీనురెడ్డి, హెచ్‌ఎం రియాజ్‌, వెంకటేశ్‌తో పాటు పలువురు అభినంధించారు. 


logo