మంగళవారం 31 మార్చి 2020
Gadwal - Jan 19, 2020 , 01:09:31

రోల్‌మోడల్‌గా గద్వాల

రోల్‌మోడల్‌గా గద్వాలగద్వాల నమస్తే తెలంగా ణ:  గత పాలకులు పురపాలక సంఘం అభివృద్ధి మరిచి వారు అభివృద్ధి చెందారు. ఈ పురపాలక ఎన్నికల్లో గద్వాల పుర కోటపై గులాబీ జెండా ఎగుర వేస్తామనే పూర్తి స్థాయి నమ్మకం ఉంది. ఈ ఎన్నికల్లో పురపాలక అభివృద్ధే ఎజెండా ముందుకు సాగుతున్నాం. ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే తమ గెలుపునకు నాంది. ప్రస్తుతం గద్వాల పురప్రజలు కాంగ్రెస్‌, బీజేపీ నేతలు చెప్పే మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. గద్వాల పురపాలక సంఘం అభివృద్ధి చెందాలంటే అది టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని ప్రజలు భావిస్తు న్నారు.. గద్వాల పురపాలక సంఘంలో ఉన్న 37 వార్డుల అభివృద్ధికి కృషి చేస్తా మని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా గద్వాల మున్సి పాలిటీలో ఏఏ అభివృద్ధి చేస్తారో ఆయన నమస్తేతెలంగాణకు వివరించారు.
నమసే తెలంగాణ: గద్వాల మున్సిపాలిటీలో ప్రచారం ఎలా కొనసాగు తుంది.

ఎమ్మెల్యే బండ్ల: గద్వాల పురపాలక సంఘంలో 37వార్డులు ఉన్నాయి. అన్ని వార్డుల్లో గులాబీ జెండా ఎగుర వేయడానికి కృషి చేస్తున్నాం. ఖచ్చితంగా అన్ని వార్డులు గెలుస్తామనే నమ్మకం మా కుంది. అభ్యర్థులు తమ వార్డుల్లో ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ప్రతి రోజు నేను ఉదయం సాయంత్రం సుమారు 10 వార్డుల్లో పర్యటిస్తూ ఓటర్‌ను కలిసే ప్రయత్నం చేస్తున్నాం. దీంతో పాటు అక్కడ క్కడ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేస్తూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్నాం.కాంగ్రెస్‌,బీజేపీతో మాకు పోటి లేదు మాకు మేమే వార్డుల్లో మెజార్టీ కోసం మా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రచారంలో ప్రతి పక్షాలు మాకు పోటే కాదు.

పుర అభివృద్ధికి ఎలాంటి ప్రణాళిక రూపొందించారు..

పురపాలక అభివృద్ధికి మంచి ప్రణాళిక రూపొందించాం. గద్వాల మార్కెట్‌ యార్డు ఆవరణలో రూ.15కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణం చేపడుతున్నాం.వీటితో పాటు బస్‌ స్టాప్‌ను రూ.మూడున్నర కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. దీంతో పాటు రూ.43కోట్లతో జిల్లా దవాఖానను అభివృద్ది చేయడానికి నిధులు ఉన్నాయి. అలాగే పురపాలక సంఘంలోని నిరుపేదల సొంతింటి కళ నెరవేర్చడానికి ప్రస్తుతం 600 డబుల్‌ ఇండ్ల్లు సిద్ధంగా ఉన్నాయి. ఎన్నికల తర్వాత మరో 1400 ఇళ్లు నిర్మించి ప్రజలకు అందిస్తాం. సంగాల చెరువు దగ్గర మినీ ట్యాంక్‌బాండ్‌ ఏర్పాటుతో పాటు జిల్లా కేంద్రంలో ప్రజలు సేద తీరడానికి పా ర్కుల అభివృద్ధి ప్రణాళిక చేస్తున్నాం. ఇప్పటికే జిల్లా కేంద్రాన్ని నిఘా నీడలో ఉంచాం. రూ.40లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాం. సీఎం గద్వాలకు వచ్చిన సమయంలో నియోజక అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించగా అందు లో పురపాలక సంఘానికి రూ.30కోట్లు రాగా  వాటితో పురపాలక సంఘంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రణాళిక రూపొందించాం. దీంతో పాటు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ గద్వాలకు రూ. 26కోట్లు కేటాయించగా ఆ నిధులతో గద్వాల మున్సిపాలిటీలో సీసీ,బీటీ రోడ్లు వేయడంతో పాటు డ్రైన్‌లు నిర్మించాం.మిగిలి పోయిన పనులు ఎన్నికల తర్వాత పూర్తి చేస్తాం.

ప్రచారంలో ప్రజలకు ఏమి హామీ ఇస్తున్నారు.

ఈ పురపాలక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆశీర్వదిస్తే పురపాలకలోని ప్రతి వార్డును అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రతి వార్డులో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు డ్రైన్‌ల ఏర్పాటు, ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ నీరు అందించడం, పూర్తి స్థాయిలో వీధి లైట్లు ఏర్పాటు చేయడం, ప్రతి వార్డును ఓ మోడల్‌ వార్డుగా తీర్చిదిద్దుతామని చెప్పడంతో పాటు వార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తాం. ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తాం. ప్రతి వార్డును స్వచ్ఛ వార్డుగా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నాం.

ఎన్నికల్లో ప్రతి పక్షాల నుంచి ఎటువంటి పోటీ ఉందా..?

గద్వాల పురపాలక సంఘంలో ప్రతి పక్షాల నుంచి తమకు ఎటు వంటి పోటీ లేదు. మా వార్డు కౌన్సిలర్లు చేస్తున్న ప్రచారంలో వారు పైసా వంతు ప్రచారం కూడా చేయడం లేదు. ఈ ఎన్నికల్లో గెలిస్తే వారు ప్రజలకు ఏమి చేస్తారో చెప్పలేని పరిస్థితిలో వారు ఉన్నారు. గెలిపిస్తే ఏమి అభివృద్ధి చేస్తారని ప్రతి పక్షాలను ప్రజలు ప్రశ్నిస్తే వారి నుంచి ఎటు వంటి సమాధానం లేదు. మాకు మేమే పోటీ తప్ప మాకు ప్రతి పక్షాలు పోటీ కాదు.logo
>>>>>>