– బ్రిక్ మొదటి సమావేశం 2009 జూన్‌లో రష్యాలోని యెకటేరిన్ బర్గ్‌లో జరిగింది.
– రెండో సమావేశం బ్రెజిల్ రాజధాని బ్రెసిలియాలో 2010 ఏప్రిల్‌లో జరిగింది. ఈ సమావేశంలో దక్షిణాఫ్రికా చేరడంతో బ్రిక్ కాస్తా బ్రిక్స్‌గా రూపాంతరం చెందింది.
– మూడో సమావేశం చైనాలోని సన్యాలో 2011 ఏప్రిల్‌లో జరిగింది.
– నాలుగో సమావేశం న్యూఢిల్లీలో 2012 మార్చిలో జరిగింది.
– ఐదో సమావేశం దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో 2013 మార్చిలో జరిగింది.
– ఆరో సమావేశం బ్రెజిల్‌లోని ఫోర్ట్‌లెజాలో 2014 జూలైలో జరిగింది. ఈ సమావేశంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకున్నారు.
– ఏడో సమావేశం రష్యాలోని ఉఫాలో 2015 జూలైలో జరిగింది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లకు ప్రత్యామ్నాయంగా న్యూడెవలప్‌మెంట్ బ్యాంకు, కంటింజెన్సీ రిజర్వులను ఏర్పాటు చేశారు.
– ఎనిమిదో సమావేశం గోవాలో 2016 అక్టోబర్‌లో జరిగింది.
– తొమ్మిదో సమావేశం చైనాలోని జియోమెన్ నగరంలో 2017 సెప్టెంబర్‌లో జరిగింది.