JNAFAU PG Admissions | భారతదేశ సంస్కృతి, వారసత్వం చాలా విశిష్టమైనవే కాకుండా విభిన్నమైనవి. గొప్ప పౌరాణిక నేపథ్యాన్ని కలిగి ఉంది. ఈ కళలను కాపాడటమే కాకుండా ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా క్రమబద్ధమైన ‘కళ’, ఆర్కిటెక్చర్లో విద్యను అందించడానికి సుమారు ఏడు దశాబ్దాల కింద ప్రారంభమైన సంస్థ ‘ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్’ కాలేజ్. 1940లో ప్రారంభమైన ఈ సంస్థ కాలాంతరంలో జేఎన్టీయూగా తదనంతరం 2008లో జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీగా ఏర్పడింది. ప్రస్తుతం ఈ కాలేజీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా…
జేఎన్ఏఎఫ్ఏయూ
జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ.. దేశంలో క్రియేటివిటీకి సంబంధించిన మూడో పురాతన సంస్థ. ప్రాంతీయ, పర్యావరణ సమస్యలపై అధిక అవగాహనతో, అత్యంత ప్రత్యేకమైన విభాగాల్లో విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దడం దీని లక్ష్యం.
ఆఫర్ చేస్తున్న పీజీ కోర్సులు (మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ – ఫుల్ టైం సెల్ఫ్ ఫైనాన్స్)
ఎవరు అర్హులు?
నోట్: జేఎన్ఏఎఫ్యూ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పెయింటింగ్, ఫైన్ ఆర్ట్స్ స్కల్ప్చర్, ఫైన్ ఆర్ట్స్ అప్లయిడ్ ఆర్ట్, ఫైన్ ఆర్ట్స్ ఫొటోగ్రఫీ, ఫైన్ ఆర్ట్స్ యానిమేషన్ కోర్సులను అందిస్తుంది. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.