Forensic Science | ప్రపంచం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అంతే స్థాయిలో నేరాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో నేరపరిశోధనలో కీలకమైన ఫోరెన్సిక్ సైన్స్ పాత్ర కూడా పెరుగుతుంది. ముఖ్యంగా వ్యవస్థీకృత నేరాల రేటు పెరుగుతున్నందున ఫోరెన్సిక్ శాస్త్రవేత్తల పని కఠినంగా, సాహసోపేతంగా మారుతున్నది. నిత్యనూతనంగా, చాలెంజింగ్‌గా ఉండే కెరీర్లో అడుగుపెట్టాలనుకునే యువతకు ఫోరెన్సిక్ సైన్స్ ఒక మంచి కెరీర్. అత్యంత ఆకర్షణీయమైన వేతనాలతో కూడిన ఉద్యోగాలు ఈ రంగంలో పుష్కలంగా ఉన్నాయి. ఏటేటా ఈ రంగ నిపుణుల అవసరం పెరుగుతుంది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఫోరెన్సిక్ డిగ్రీ, పీజీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే ఆల్ ఇండియా ఫోరెన్సిక్ సైన్స్ ఎంట్రన్స్ టెస్ట్ (AIFSET 2024) నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో సంక్షిప్త సమాచారం…
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: అక్టోబర్ 28
ఫలితాల వెల్లడి: అక్టోబర్ 31
వెబ్సైట్:https://aifset.com/important-dates.html