సినిమాల ఎంపికలో వేగం పెంచుతున్నారు కథానాయకుడు బాలకృష్ణ. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారాయన. తాజాగా బాలకృష్ణ మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. సంపత్‌నంది దర్శకత్వంలో ఓ సినిమాను అంగీకరించినట్లు సమాచారం. ‘సీటీమార్’ సినిమాతో కమర్షియల్ సక్సెస్‌ను అందుకున్నారు దర్శకుడు సంపత్‌నంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. బాలకృష్ణ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని యాక్షన్, మాస్ అంశాల మేళవింపుతో సంపత్‌నంది ఓ కథను సిద్ధంచేసినట్లు తెలిసింది. కథాంశంలోని కొత్తదనం నచ్చడంతో బాలకృష్ణ ఈ సినిమా చేయడానికి సుముఖతను వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. త్వరలో ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.