టాటా నుంచి నయా ఏరిస్.. ప్రారంభ ధర రూ.5.29 లక్షలు
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్..దేశీయ మార్కెట్లోకి సరికొత్త కారును పరిచయం చేసింది. ఏరిస్ పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ డిజైనింగ్, కంఫర్ట్, టెక్నాలజీ, నూతన ఫీచర్లు, వ్యక్తిగతంగా వినియోగించుకోవడానికి వీలుగా డిజైన్ చేసిన ఈ మాడల్ రూ.5.29 లక్షల నుంచి రూ.6.29 లక్షల లోపు ధరను నిర్ణయించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్..దేశీయ మార్కెట్లోకి సరికొత్త కారును పరిచయం చేసింది. ఏరిస్ పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ డిజైనింగ్, కంఫర్ట్, టెక్నాలజీ, నూతన ఫీచర్లు, వ్యక్తిగతంగా వినియోగించుకోవడానికి వీలుగా డిజైన్ చేసిన ఈ మాడల్ రూ.5.29 లక్షల నుంచి రూ.6.29 లక్షల లోపు ధరను నిర్ణయించింది. ఈ సందర్భంగా టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్ లిమిటెడ్ ఎండీ, సీఈవో శైలేష్ చంద్ర మాట్లాడుతూ..నూతన డ్రైవింగ్ అనుభవం కోరుకుంటున్న యువతను దృష్టిలో పెట్టుకొని ఈ మాడల్‌ను డిజైన్ చేసినట్టు, అలాగే పనితీరు, ైస్టెలిష్, టెక్నాలజీ, భద్రతా ప్రమాణాలకు పెద్దపీట వేసినట్టు చెప్పారు.
ధరలు పెంచే యోచనలో సంస్థ
గడిచిన రెండేండ్లుగా మూడు సార్లు ధరలు పెంచిన సంస్థ మరోసారి ధరలు పెంచడానికి సిద్ధమవుతున్నది. కమోడిటీ ఉత్పత్తుల ధరలు భారీగా పుంజుకుంటున్న నేపథ్యంలో సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి మరోసారి ధరలు పెంచకతప్పదని శైలేష్ చంద్ర సూచనప్రాయంగా చెప్పారు. ఇటీవలికాలంలో కమోడిటీ ఉత్పత్తుల ధరలు రెండంకెల స్థాయిలో పెరిగాయని, దీంతో సంస్థ లాభాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తున్నదని, దీంతో ధరలను సవరించకతప్పదని చెప్పారు. అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చేలా ప్యాసింజర్, కమర్షియల్ వాహన ధరలను ఒక్క శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

