సిగ్మా సక్సెస్ కావడం ఖాయం
‘ఎవరిమాటా వినని వాడ్ని ‘సిగ్మా’ అంటారని తెలిసింది. ఇది నిజంగా న్యూ థాట్. ట్రైలర్ చూస్తే సినిమా చూడాలనిపిస్తుంది. సక్సెస్ ఖాయం. ఈ వేడుకకు రావడానికి కారణం సందీప్‌కిషన్. తను నా కుటుంబసభ్యుల్లో ఒకడు. విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ డైరెక్షన్లో సినిమా అనగానే.. వాళ్ల తాత ఎస్.ఏ.చంద్రశేఖర్ గుర్తొచ్చారు.
‘ఎవరిమాటా వినని వాడ్ని ‘సిగ్మా’ అంటారని తెలిసింది. ఇది నిజంగా న్యూ థాట్. ట్రైలర్ చూస్తే సినిమా చూడాలనిపిస్తుంది. సక్సెస్ ఖాయం. ఈ వేడుకకు రావడానికి కారణం సందీప్‌కిషన్. తను నా కుటుంబసభ్యుల్లో ఒకడు. విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ డైరెక్షన్లో సినిమా అనగానే.. వాళ్ల తాత ఎస్.ఏ.చంద్రశేఖర్ గుర్తొచ్చారు. ఆయన దర్శకత్వంలో చట్టానికి కళ్లులేవు, దేవాంతకుడు వంటి మంచి సినిమాలు చేశాను. ఆయన మనవడు సినిమా అనగానే రాకుండా ఉండలేకపోయా. వాళ్ల నాన్న విజయ్‌లా సంజయ్ కూడా గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నా.
ఈ సినిమా సందీప్‌కిషన్‌కి బ్లాక్‌బస్టర్‌గా నిలవాలి’ అని అగ్ర కథానాయకుడు చిరంజీవి ఆకాంక్షించారు. సందీప్‌కిషన్ హీరోగా జేసన్ సంజయ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ అడ్వెంచర్ ‘సిగ్మా’. ఫరియా అబ్దుల్లా కథానాయిక. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానున్నది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడారు. జేసన్ సంజయ్ మాట్లాడుతూ ‘ఇది యాక్షన్ అడ్వెంచర్. కొత్త ఎలిమెంట్స్ ఉంటాయి. ట్రెజర్ హంట్ మూవీ ఇది. సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుంది. నన్ను, నా విజన్‌ని నమ్మినందుకు సందీప్‌కి థ్యాంక్స్.
ప్రేక్షకుల స్పందన కోసం ఎదురు చూస్తున్నా’ అని పేర్కొన్నారు. ‘మమ్మల్ని నమ్మి ఇంత ఖర్చుపెట్టిన లైకా సంస్థకు కృతజ్ఞతలు. డైరెక్టర్‌గా జేసన్ సంజయ్ డెబ్యూ మూవీకి నేను హీరో అనగానే నమ్మలేకపోయా. 70 రోజుల్లో అద్భుతంగా సినిమా తీశాడు తను. గోల్డ్ స్ఫూన్‌తో పుట్టినా.. స్వయంకృషితో ఎదగాలని తపించే 24ఏండ్ల కుర్రాడు తీసిన సినిమా ఇది’ అని హీరో సందీప్‌కిషన్ చెప్పారు. ఇంకా ఫరియా అబ్దుల్లా, చోటా కె.నాయుడు, తమన్, మిర్చి సంపత్ తదితర చిత్రబృందంతోపాటు నవీన్ యర్నేని, లగడపాటి శ్రీధర్, ఎస్కేఎన్, సాయిరాజేశ్ తదితరులు కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

