కోలుకున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 315, నిఫ్టీ 77 పాయింట్లు అప్
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల నుంచి తిరిగి కోలుకున్నాయి. బ్లూచిప్ సంస్థల షేర్లతోపాటు బ్యాంకింగ్, చమురు అండ్ గ్యాస్, వాహన రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు.
ముంబై, సెప్టెంబర్ 25: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల నుంచి తిరిగి కోలుకున్నాయి. బ్లూచిప్ సంస్థల షేర్లతోపాటు బ్యాంకింగ్, చమురు అండ్ గ్యాస్, వాహన రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా వారాంతపు ట్రేడింగ్‌లో సూచీలు లాభాల్లోకి రాగలిగాయి. ఒక దశలో 500 పాయింట్ల వరకు పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 315.20 పాయింట్లు అందుకొని 73,895.74 వద్ద నిలిచింది.
30 షేర్ల ఇండెక్స్‌లో 19 షేర్లు లాభపడగా, 11 షేర్లు నష్టపోయాయి. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 77.40 పాయింట్లు అందుకొని 23,140.50 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ఇంధన ధర 1 శాతం తగ్గి 105 డాలర్లకు తగ్గడం మదుపర్లలో ఉత్సాహాన్ని నింపిందని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. తీవ్ర ఊగిసలాటల మధ్య కొనసాగిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు చివరికి లాభాల్లోకి రావడానికి దోహదపడ్డాయన్నారు.
- యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా షేర్లు రెండు శాతానికి పైగా బలపడ్డాయి.
- వీటితోపాటు ఏషియన్ పెయింట్స్, టీవీఎస్ మోటర్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, టైటాన్ షేర్లు ఒక్క శాతానికి పైగా పెరిగాయి.
- అలాగే ఇండిగో, ఎల్అండ్టీ, నెస్లె, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, శ్రీరామ్‌ఫైనాన్స్, రిలయన్స్, మారుతి, హెచ్ఏఎల్, ఐటీసీ, ఎస్బీఐ షేర్లు లాభపడ్డాయి.
- మ్యాక్స్‌హెల్త్‌కేర్ షేరు 3.20 శాతం తగ్గి టాప్ లూజర్‌గా నిలిచింది.
- దీంతోపాటు టీఎంపీవీ, ట్రెంట్, ఓఎన్జీసీ, జియోఫైనాన్స్, ఇన్ఫోసిస్, హిందాల్కో, ఎస్బీఐ లైఫ్, సిప్లా, కొటక్ బ్యాంక్ షేర్లు పతనం చెందాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

