రాజమౌళికి సినిమా చూపిస్తా

‘అతిథులను దేవుడిలా భావించే ఓ యువకుడి కథ ఇది. అతడి జీవితంలోకి వచ్చిన ముఖ్యమైన అతిథులు ఎవరన్నది ఉత్కంఠను పంచుతుంది’ అని అన్నారు పొలిమేర నాగేశ్వర్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘అతిథిదేవోభవ’. ఆది సాయికుమార్, నువేక్ష జంటగా నటించారు. రాజబాబు మిర్యాల, అశోక్‌రెడ్డి మిర్యాల నిర్మించారు. ఈ నెల 7న విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో పొలిమేర నాగేశ్వర్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘దర్శకుడిగా నా మొదటి సినిమా ఇది. గతంలో కె.విశ్వనాథ్, రాజమౌళి, వి.వి.వినాయక్లవద్ద దర్శకత్వశాఖలో పనిచేశా. నిర్మాత రాజబాబు చెప్పిన కథలోని కొత్తదనం నచ్చడంతో సినిమా చేయడానికి అంగీకరించా. ప్రేమ, యాక్షన్‌తో పాటు చక్కటి థ్రిల్‌ను పంచే చిత్రమిది. ప్రతిక్షణం హీరో భయంతో బతుకుతుంటాడు. ఆ భయం వెనకున్న కారణమేమిటన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. హీరోగా ఆదిని కొత్త పంథాలో ఆవిష్కరిస్తుంది. శేఖర్ చంద్ర స్వరపరచిన పాటలతో పాటు ట్రైలర్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది. అవకాశం దొరికితే నా గురువు, దర్శకుడు రాజమౌళికి నా సినిమా చూపించాలనుంది’ అని తెలిపారు.
Read Today's Latest Entertainment News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

