న్యూఢిల్లీ, జూలై 23: ముడి చమురు ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ నడుమ దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో సంక్షోభం తిరిగి ముదురుతున్నది. ఈ ప్రభావం అంతర్జాతీయ క్రూడాయిల్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే గురువారం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ రేటు 6 శాతానికి పైగా ఎగిసి 100 డాలర్లను తాకింది.
ఈ ఏడాది మే నెల నుంచి గమనిస్తే ఈ మార్కును ధరలు అందుకోవడం ఇదే తొలిసారి. ఇటు ఇరాన్ దాడులతో హొర్ముజ్, అటు హౌతీల భయంతో ఎర్ర సముద్రంలో సరఫరా సజావుగా సాగడం లేదు. ఈ పరిస్థితి ఆయిల్ ధరలకు రెక్కలు తొడుగుతున్నది. గ్యాస్ ధరలూ నెల రోజులుగా ఎగబాకుతున్నాయి.