పని-పాట
పాట పాడుకుంటూ పనిచేస్తున్నారు పొలాల్లో అలసట అసలు తెలుస్తలేదు! పొద్దు గుంకున్నది తెల్వటంలే!
పాట పాడుకుంటూ పనిచేస్తున్నారు పొలాల్లో
అలసట అసలు తెలుస్తలేదు!
పొద్దు గుంకున్నది తెల్వటంలే!
పని ఒడుస్తలేదని అనిపిస్తలేదు
ఇంకా పని చేయాలనిపిస్తున్నది మనసుకు!
పాట పాడుతుంటే ఎక్కడి పక్షులో
వచ్చి కోరస్ కూతలు!
సూర్యుడికీ అస్తమించాలని లేదు
పాట పాడుతూ పని చేసేవారిని
ఇంకా చూడాలనే ఉంది
సూర్యుడూ మరి శ్రామికుడే కదా అందుకే!
పనిచేస్తుంటే పాట అదే సహజంగా హృదయాల్లోంచి
పుట్టి రాగ రంజితంగా ఎన్నో వర్ణాలు వర్ణాలు
గట్ల వెంట అందరి నోట పాట కచేరి!
పని లేనిదే పాట పుట్టదు
పని శ్రామికంగా గానం అవుతున్నది
పాట పాడుతున్న వారి
పాదాలకు గండ పెండేరాలు లేవు
చేతులకు స్వర్ణ కంకణాలు లేవు
పట్టు శాలువాలు లేవు
పాదాలు బురద బురద
చేతుల్లో నాట్లు వేసే ఆకుపచ్చని వరి మొలకలు
స్వేద గంధంతో ఒంటి పైనున్న బట్టలు
పాట ఏ రచయిత రాసింది కాదు
పనిలోంచి ధ్వనించి ప్రపంచమైన పాట!!
-కందాళై రాఘవాచార్య ,87905 93638
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

