ఫల హీనం నృపం భృత్యాః
కులీనమపి చోన్నతం
సంతజ్యానత్ర గచ్ఛంతి
శుష్కం వృక్ష మివాండజాః
ఎండి పోయిన వృక్షమును వదిలి పక్షులు మరొక చెట్టును ఆశ్రయించినట్లుగా కులీనుడు, ఉన్నతుడు ఐనప్పటికీ తగిన వేతనములను సకాలంలో చెల్లించలేని యజమానిని వదిలిపెట్టి సేవకులు మరొకరిని ఆశ్రయించుదురు. కావున యజమాని తమ సేవకుల జీతభత్యముల చెల్లింపు విషయములో తగిన జాగ్రత్తలు పాటించవలెను.