సింతమడక పల్లెతల్లికి
సిన్నిబాలుడు బుట్టినాడులే
సింతలన్నీ దీర్చెటందుకు
మనిషిజన్మనే ఎత్తినాడులే
ఎదుగుతూనే ప్రశ్నలడిగే
నైజమే వచ్చినాదిలే
పెరిగినాక ప్రపంచాన
చరితలాగ వెలుగొందుతుండులే
అతడు: అదిగదిగో,
అడుగడుగున ఉద్యమపోరు
పోరాటమే తన ఇంటి పేరు
మడమతిప్పని తీరు
మన కేసీయారు సారు
గుణము సల్లని యేరు
గళము సంద్రపుహోరు
గగనాన సెంద్రుడి మారు…
మన కేసీయారు సారు
హేయ్….
జై జై జై జై జై జై…మీ సమయస్ఫూర్తికే
జై జై జై జై జై జై…మీ స్వప్న కాంక్షకే
జై జై జై జై జై జై..మీ సాహసానికే
జై జై జై జై జై జై…త్యాగధనుడా..ఆ…(సింతమడక)
చరణం1:
స్వేచ్ఛ వచ్చిన నాటినుండి
స్వచ్ఛమైన పాలనకై..
సేవానిరతి చాటుతూనే
భారతమాత సైనికుడై…
పిడికిలి పిడుగల్లేజేసి,
ఉడుకుమంటల నెత్తురెగసి,
అడుగుతుండు బెదరకుండ
నిగ్గదీసే వీరుడయ్యి …
భారతమాత సుపుత్రుడై…
బీఆరెస్సు వెట్టెనో.. గుండాలపాలనలో గులాబీ జెండై ఎగిరే…
జై జై జై జై జై జై… మీ శూరత్వానికే..
జై జై జై జై జై జై…మీ ధీరత్వానికే..
జై జై జై జై జై జై…మీ వీరత్వానికే…
జై జై జై జై జై జై…జాతి ఘనుడా..ఆ…(సింతమడక)
చరణం2:
బక్కపలచ దేహమే
కొట్లాటకే పోరుసలిపే
ఒక్కడిగా మొదలై కోట్ల
జనాన్నొక్కటిజేసే
ఊహలన్న ప్రపంచాన్ని
నిజం జేసీ చూపిండే…
బడుగుజీవుల గోస దీర్చి
తెలంగాణ మాడల్ దెచ్చి
ఆబ్ కి బార్ కిసాన్ సర్కార్
గావలని జనం గోరే…
కారు సైరన్ మోత కొరకు
దేశమంత ఎదురుజూసే..
జై జై జై జై జై జై… కారే కావాలిలే
జై జై జై జై జై జై… సారే రావాలిలే
జై జై జై జై జై జై….మీరే గెలవాలిలే
జై జై జై జై జై జై… చంద్రశేఖరా..ఆ…(సింతమడక )
ఓ…ఓ….ఓ…..ఓ…..
జై కేసీఆర్…జై జై కేసీఆర్….సాగిపో సాగిపో..
విజయీభవ కేసీఆర్… విజయీభవ……
రచన: లక్ష్మణ్ గంగా