॥సీ॥
భారత దేశపు భాసిల్లు వేదాంత
తత్వమ్ము దెలిపిన తపస్వి యెవరు?
దివ్యనాధ్యాత్మిక దీప్తి పుంజములను
జగతికి పంచిన సదయుడెవరు?
దేశాల మధ్యన దివ్య సంబంధాలు
నెరిపినట్టి సుగుణ నేత యెవరు?
విశ్వవిద్యాలయ విద్యను ప్రీతితో
ఛాత్రుల కొసగిన సౌమ్యుడెవరు?
తే.గీ.!
అతుల ధీశాలి, సద్వక్త; యమలకీర్తి
పొందినట్టి భరతమాత పుత్రుడతడు
శాంతి కాముకుండు, వివేకి సర్వెపల్లి
జన్మదిన మహోత్సవమున
సన్నుతింతు
– గొల్లపల్లి రఘురామశర్మ 9989149454