వెలవెలబోయిన వెయ్యి రోజుల పాలన
పదునాలుగేడులు పలుచన గానీక నుద్యమంబు నడిపెనుత్తమముగ ప్రజల మనస్సున రాజిల్ల జేసెను సొంత రాష్ట్రకలను సంతతతముగ ఆత్మ గౌరవమునా ఆంధ్ర ప్రభుత నుండి తాకట్టువిడిపించె ధైర్యమూని విలవిలలాడెడు తెలగాన ప్రాంతపు విలువను పెంచెను విశ్వమందు
పదునాలుగేడులు పలుచన గానీక
నుద్యమంబు నడిపెనుత్తమముగ
ప్రజల మనస్సున రాజిల్ల జేసెను
సొంత రాష్ట్రకలను సంతతతముగ
ఆత్మ గౌరవమునా ఆంధ్ర ప్రభుత నుండి
తాకట్టువిడిపించె ధైర్యమూని
విలవిలలాడెడు తెలగాన ప్రాంతపు
విలువను పెంచెను విశ్వమందు
తెచ్చి తెలగాన రాష్ట్రము తెగువమీర
వర్ష దశపాలనమునందు హర్షమెగయ
దీర్ఘకాలపు కలలను దీర్చినాడు
చంద్రశేఖరుండనఘుడు చాలఘనుడు
తృప్తినుద్యోగులకునెంతొ తెచ్ఛిపెట్టి
సొంతరాష్ట్రమునకువింత సొబగులద్ది
దశనుమార్చుచు నభివృద్ధి దిశను నడుపు
వేళ ప్రభుత మారెనయయో! విధియె కాదె!
వెయ్యిదినముల పాలన నొయ్యకొనిన
నన్నివర్గముల ప్రజలకెన్నొ పాట్లు
బ్రతుకు కష్టములందున చితుకుచుండె
నెంచ ఫలితము మంచిని ముంచు క్రియకు
వర్షములేక యెండినవి
పంటపొలంబులు నీటియెద్దడిన్
కర్షకలోకమంత కడు
కష్టములందునమున్గి యుండ స్వో
త్కర్షను చాటుచుండెనిట
కర్కశమైన ప్రభుత్వ మెచ్చటన్
హర్షములేదు కాంచగ మహాపద
ముంచుకు వచ్చుచుండెగా
ఇండ్లు కూలి పోయి ఇడుములపడువారు
బాధ పొందువారు పైసలేక
పథకములకొరకని పరితపించెడువారు
శాంతి లేక నిడగ శాపములను
కులుకు చున్నారు నేతలు కుటిలులగుచు
ప్రజల గోడును పట్టక బరితెగించి
కొట్టుకొనుచున్నారిదె చట్టసభను
మార్పు చేయకుంండిన కల్గు మనకు ముప్పు
-చిలకమర్రి కృష్ణమాచార్యులు ,9985513883
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

