కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం ఆనకట్ట కాదు ఎన్నో బ్యారేజీలు, జలాశయాలు, పంపు హౌస్లు మైదానంలో, ఎత్తు పల్లాల్లో అడవుల్లో, సొరంగాల్లో ప్రవహించే కాలువలు
కాళేశ్వరం ప్రాజెక్టు
తెలంగాణ గొంతును తడిపే సెలయేరు
తెలంగాణ నేలను సాగు చేసే
పంట కాలువ
తెలంగాణ సస్యశ్యామల పథకం
తెలంగాణ అమృత వాహిని
తెలంగాణ ప్రగతి రథం
తెలంగాణం జీవ ధార
తెలంగాణ భూగర్భ జల నిధి
తెలంగాణ రైతు కామధేనువు
తెలంగాణ బతుకు ఆశాజ్యోతి
కాళేశ్వరం ప్రాజెక్టు
కేసీఆర్ స్వప్నం
కేసీఆర్ సంకల్పం
కేసీఆర్ మేధోమథనం
కేసీఆర్ గుండెచప్పుడు
కేసీఆర్ ఆత్మ
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం
సాధ్యమైన కేసీఆర్ సంకల్పం
నెరవేరిన కేసీఆర్ ఆకాంక్ష
తెలంగాణ ప్రజల అంతిమ విజయం…
– డాక్టర్ బీఎన్ రావు