అర్థార్థీ జీవ లోకోయం
శ్మశానమపి సేవతే
త్యక్తాజనయితాగం స్వం
ని స్వం గచ్ఛతి దూరతః
ధనాశ గల మానవుడు దరిద్రుడైన కన్న తండ్రినైనను వదలిపెట్టి దూరముగ వెళ్లిపోయి శ్మశానములోనైన పనులు చేసుకొని ధనము సంపాదించుటకు కష్టపడుచుండును. కానీ కన్నతల్లి దండ్రులు కదా-పేదరికంలో ఉన్నారు కదా! వారికి తోడుగా ఉండుట పుత్రధర్మము అని తలంచడు.