మిత్రులందరికీ నమస్తే, ఉపాధ్యాయులకు సెలవులు ఎక్కువ అని గతంలో ఒకసారి సీఎం నిందలు మోపిన సందర్భంలో 10-02-2021వ తేదీన నేను ఇచ్చిన వివరణ మళ్లీ ఒకసారి మనందరి కోసం..
ఉపాధ్యాయులు ఏడాది కాలంలో 220 రోజులు మాత్రమే పనిచేస్తారు కాబట్టి, వారికి వేతన సవరణ అవసరమా? ఉద్యోగ విరమణ వయసు పెంపు అవసరమా? అంటూ ఈరోజు కొన్ని పత్రికల్లో ఉపాధ్యాయుల మనోభావాలను, ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసే విధంగా కథనాలు రావడం జరిగింది. ఉద్యోగుల నుంచి ఉపాధ్యాయులను వేరు చేసి పనిచేయని వారి కింద చూపించే ప్రయత్నం జరిగింది.
ఒక నిమిషం ఉపాధ్యాయుల పనిదినాలను పక్కనపెట్టి, అసలు ఉద్యోగులు ఎన్నిరోజులు పని చేస్తున్నారన్న విషయాన్ని కూడా ఒకసారి గమనిద్దాం.
1.ఒక సంవత్సరానికి 365 రోజులుంటాయి.
2.ఈ 2021వ సంవత్సరంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం.. పండుగల సందర్భంలో ఇచ్చిన సాధారణ సెలవులు (ఆదివారాలు కాకుండా) 26.
3.అంతేకాకుండా ప్రభుత్వం 25 రోజులు ఆప్షనల్ హాలిడేస్గా ప్రకటించింది. ఇందులో నుంచి ఏవైనా 5 రోజులను ఉద్యోగులు సెలవు కింద వాడుకుంటారు.
4.ఒక సంవత్సరంలో కనీసంగా 52 ఆదివారాలు వస్తాయి. ఇవి కూడా ఉద్యోగులకు సెలవులే.
5.ప్రతి నెల రెండవ శనివారం సెలవు. జనవరి 1వ తేదీ సెలవుకు బదులుగా పనిచేసే ఫిబ్రవరి రెండవ శనివారంను వదిలిపెడితే మిగతా 11 నెలలకు 11 రోజులు ఉద్యోగులకు సెలవు.
6.ఒక సంవత్సర కాలం విధులు నిర్వహిస్తే ఉపాధ్యాయులకు 6 రోజులు సంపాదిత సెలవులు ఉద్యోగులకు 30 రోజులు సంపాదిత సెలవులు మంజూరు చేస్తారు. అంటే ఉపాధ్యాయుల కంటే 24 రోజుల సంపాదిత సెలవు ఉద్యోగులకు అదనంగా ఇవ్వబడుతుంది.
7.ఒకసారి ఉద్యోగుల మొత్తం సెలవులను లెక్కించి చూద్దాం.
8.ఒకసారి పనిగంటలు కూడా లెక్కిద్దాం.
9. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పనిచేసే కాలానికి ఈ రోజుల్లో లెక్క చూసినట్టయితే వ్యత్యాసం 27 రోజులు. పనిచేసే కాలాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే ఆ వ్యత్యాసం 27-25= 2 రోజులు మాత్రమే.
10. ఒక సంవత్సర కాలంలో ఉన్న 2 రోజుల పనిదినాల వ్యత్యాసానికి ఉపాధ్యాయులను అంత కించపరచడం భావ్యం కాదు.
11.ఆదివారాలు, పండుగలు ఉపాధ్యాయులు కూడా సెలవే కదా అని ఆలోచన ఎవరికైనా వచ్చిందేమో, ఏ సెలవులతో నిమిత్తం లేకుండా ఒక సంవత్సరంలో పాఠశాల కనీసంగా 220 రోజులు పనిచేస్తుంది.
12.ఉపాధ్యాయులు, ఉద్యోగుల మధ్య ఈ రకమైన లెక్కలు వ్యవస్థకు మంచి చేయవు. అందరూ ప్రభుత్వ సేవకులే. కేవలం వాస్తవం తెలియాలనే ఉద్దేశంతోనే ఈ వివరణ తప్ప ఎవరినీ కించపరిచే ఉద్దేశం కాదు.
13.ఇంకా సంక్రాంతి, దసరా సెలవులు, ఎండకాలం సెలవులు గురించి ఒక మాట. అవన్నీ పిల్లల కోసం ఇచ్చిన సెలవులే కానీ, ఉపాధ్యాయుల కోసం ఇచ్చిన సెలవులు కాదు. ఏ సెలవుల్లోనైనా ప్రభుత్వం ట్రైనింగ్ ప్రోగ్రాంలు నిర్వహించినా, సర్వేలు చేయమన్నా, రకరకాల పరీక్షల విధులు నిర్వహించమన్నా, ఎలక్షన్ విధులు నిర్వహించమన్నా కూడా ఉపాధ్యాయులు ఎప్పుడైనా మనస్ఫూర్తిగా, ఫలవంతంగా విధులు నిర్వహించి ప్రభుత్వ ప్రతీ కార్యక్రమాన్ని జయప్రదం చేసినవారే. ఒక్కసారి మనసుతో ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ…