తెలంగాణాన, కట్టప్ప బానిస బుద్ధుల పెద్దలు,
పరాయి కుట్ర శక్తులకు, సద్దులు మోస్తూ,
పబ్బం గడుపుకోవాలని, స్వామి భక్తి చాటుకోవాలని,
నిరంతరం తహతహ లాడితే, చెప్పిందానికల్లా,
గంగిరెద్దులై తలూపితే, తెలంగాణా ఆకలి రాజ్యమే.
తెలంగాణా గోదారమ్మను, అభినవ రావణులు,
తోలుకెళ్తుంటే, వాళ్లు కాళ్లు కడుక్కోవడానికి,
జనం దూప దీర్చుకోవడానికని, సర్ది చెప్పేటి,
పెద్ద మనుషుల, వెట్టి బానిసత్వానికి రుజువు.
చివరకు, తెలంగాణా నీళ్లు లేని ఎడారే.
గంగా కావేరి జలానుసంధానాన్ని తుంగలో తొక్కి,
దక్షిణాది జలాలు, ఉత్తరాది జలాలని,
వేరు కుంపటి కుళ్లుతో, తెలంగాణాకన్యాయం.
కాళ్లు మొక్కుత బాంచనలు చెయ్యడానికే.
దక్షిణాది రాష్ర్టాల, జల వివాద పరిష్కారమని,
కేంద్రం, రాజకీయ ఉంగుళీలు పెట్టి కెలకక,
భారతీయులంతా వక్కటేనన్న దృక్పథంతో,
జల భారతాన్ని సస్యశ్యామలం చెయ్యండి..
గంగా కావేరిని కలిపాక, మా గోదారి తెర్వురారి.
ఆనక బనకచర్ల కట్టుకుంటవో, ఊర్కుంటవో.
కాదని ముందుకు కదిల్తే, యావత్ తెలంగాణా,
పిడికిళ్లు బిగించి, మరో జల పోరాటానికి సిద్ధమే.
మా జలాలు మాకేనని, తెలంగాణా అవతరించాక,
తేరుకుని, మా మానాన, మేం బత్కుతున్నం.
ఓర్వలేని జీవాలు, కంచె దూకి మేస్తనంటే ఊర్కోం.
బరాబర్ కొట్లాడతం, మా వనరులు దక్కించుకుంటం
తెలంగాణా గడ్డపై పుట్టిన తెలుగు బిడ్డలూ,
సిద్ధంగా ఉండండి, మన ఉనికిని మనమే కాపాడుకోవాలి
పోరాటం మనకు, కొత్తేం కాదు, కాకలు తీరిన వాళ్లమే.
తెలంగాణా పొలాల రక్షణకు, జల తెలంగాణాకు జై అనండి.