తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ సరఫరా లేక అంధకారంలో మగ్గవలసి వస్తుందని ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలను భయపెట్టారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ హయాంలో నిత్యం విద్యుత్ కోతలతో సతమతమయ్యారు. అనేక చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయి. ఎంతోమంది ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ సర్కార్ మొదట విద్యుత్రంగంపైనే దృష్టి సారించింది. ఈ క్రమంలోనే పదేండ్ల పాటు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా సుపరిపాలనను అందించింది. అయితే, ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలుచేయకపోగా ఇప్పుడు ప్రజలకు కరెంట్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతుండటం ఆందోళనకరం.
పరాయి పాలకుల హయాంలో కరెంటు సమస్యలతో అతలాకుతలమైన తెలంగాణ ప్రాంత ప్రజలు పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఊపిరి పీల్చుకున్నా రు. కేసీఆర్ హయాంలో విద్యుత్‌రంగ స్వరూపమే మారిపోయింది. ప్రణాళికా బద్ధంగా కేసీఆర్ చేపట్టిన చర్యలతో విద్యు త్తు కోతలకు అడ్డుకట్ట పడింది. విద్యుత్తు ఉత్పాదనలో తెలంగాణ మిగులు రాష్ట్రం గా అవతరించింది. అయితే, రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఒక్కసారిగా విద్యుత్ సంక్షోభం తలెత్తింది. విద్యుత్ ఉత్పాదన, నిర్వహణా లోపాల కారణంగా కోతలు పునరావృతమవుతున్నాయి. అయితే, ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ప్రజలపై విద్యుత్ చార్జీల పెం పుతో పెనుభారం మోపేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధపడుతుండటం ఆందోళనకరం. ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించి గద్దెనెక్కిన కాంగ్రెస్.. ప్రజలు హామీలు అమలుచేయాలని ఒత్తిడి చేస్తుండటంతో వారిపై రకరకాల పన్నుల భారాన్ని మోపుతున్నది.
తెలంగాణలోనే కాకుండా కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ రాష్ర్టాల్లోనూ అక్కడి ప్రభుత్వాలు దొడ్డిదారిన ప్రజలపై భారం మోపుతున్నాయి. గ్యారెంటీలను అమలుచేయలేక కుంటిసాకులతో కాలయాపన చేస్తున్నాయి. ఒక ప్రణాళిక లేని పాలనతో తప్పటడుగులు వేస్తున్న కాంగ్రెస్ సర్కార్ విద్యుత్ చార్జీలు పెంచాలనే ప్రతిపాదనలను తెరపైకి తీసు కువచ్చింది. తద్వారా ప్రజలపై రూ.18, 500 కోట్ల మేర అదనపు భారం పడే అవ కాశాలున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో రూ.14,222 కోట్లు ఆదాయలోటు ఉన్నదని డిస్కంలు విద్యుత్ నియంత్రణ మండలిలో పిటిషన్ దాఖలు చేశాయి. ఉత్పత్తి సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్న కరెంట్‌కు, వినియోగదారులకు పంపిణీ చేస్తున్న కరెంటుకు మధ్య భారీ లోటు ఉన్నదని, దాన్ని పూడ్చేందుకుగాను చార్జీల పెంపునకు అవకాశమివ్వాలని ఈఆర్సీకి విన్నవించాయి. అయి తే, వాస్తవ రెవెన్యూ వ్యత్యాసం రూ.5,95 8 కోట్లు మాత్రమే ఉంటుందని ఎస్పీడీసీఎల్ అంచనా వేస్తుండటం గమనార్హం.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పటికే వ్యవసాయరంగం మొదలుకొని పారిశ్రామికరంగం వరకు అన్నిరంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ దశ లో విద్యుత్ చార్జీల పెంపు సరికాదని, ప్రతిపాదనలను తిరస్కరించాలని విద్యుత్ నియంత్రణ మండలికి బీఆర్ఎస్ విజ్ఞాప న పత్రం అందజేసింది. పారిశ్రామికరంగానికి సంబంధించి అన్ని క్యాటగిరీలకు ఒకేరకంగా చార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అంతేకాదు, ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజల నడ్డి విరవాలనే కుట్ర చేస్తున్నది. హైటెన్షన్ (హెచ్‌టీ) వినియోగదారులకు 11 కేవీ కనెక్షన్‌కు వసూలు చేస్తున్నట్టుగానే.. 33 కేవీ, 132 కేవీ కనెక్షన్లకు కూడా చార్జీలు వసూ లు చేయాలనే ప్రతిపాదనలున్నాయి. ప్రస్తుతం పరిశ్రమలకు సంబంధించి 11 కేవీ యూనిట్‌కు రూ.7.65, 33 కేవీకి రూ.7.15, 132 కేవీకి రూ.6.65 చొప్పు న డిస్కంలు వసూలు చేస్తున్నాయి. అయి తే, ఇకపై ఈ మూడు క్యాటగిరీలకు 11 కేవీ మాదిరిగానే యూనిట్‌కు రూ.7.65 చొప్పున వసూలు చేస్తే పరిశ్రమలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది.
పరిశ్రమలపైనే కాకుండా స్థిర చార్జీల పేరిట గృహ వినియోగదారులపై గుదిబండ మోపాలని కాంగ్రెస్ సర్కార్ చూస్తున్న ది. ఇండ్లల్లో వాడుకునే కరెంటు నెలకు 300 యూనిట్లు దాటితే కిలోవాట్‌కు ఫిక్స్ డ్ ఛార్జీ ప్రస్తుతం రూ.10 వసూలు చేస్తుండగా.. దాన్ని రూ.50కి పెంచాలని డిస్కం లు కోరాయి. అంటే ప్రజలపై ఐదు రెట్ల భారం పడనున్నది. 200 యూనిట్లలోపు వాడే వినియోగదారులకు గృహజ్యోతి పేరి ట ఉచిత కరెంటు ఇస్తామని చెప్పిన కాం గ్రెస్ సర్కారు లబ్ధిదారుల సంఖ్యలో భారీ గా కోత పెట్టింది.
గతంలో ఎన్ని కష్టాలు ఎదురైనా కేసీఆర్ సర్కార్ ప్రజలపై విద్యుత్ చార్జీల భారాన్ని పడనీయలేదు. విద్యుత్ చార్జీలు పెంచాలని డిస్కంలు ప్రతిపాదనలు పంపి నా కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించలేదు. అంతేకాదు, వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందించిన కేసీఆర్ సర్కార్ రూ.వేల కోట్ల భారాన్ని మోసింది. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పాదనను పదేండ్లలో మూడు రెట్లకు పైగా పెంచింది. విద్యుత్ రంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విప్లవాత్మక మార్పు ల కారణంగా రాష్ట్రంలో ఉపాధి అవకాశా లు పెరిగాయి. పారిశ్రామికంగా రాష్ట్రం కొత్త పుంతలు తొక్కింది. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తి డి చేసినా కేసీఆర్ సర్కార్ అంగీకరించలే దు. అయితే, ఈ విషయమై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి తెలపాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ నిలదీసినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొహం చాటేశారు.
విద్యుత్ చార్జీల పెంపునకు డిస్కంలు చూపుతున్న కారణాలు
సహేతుకంగా లేవని విద్యుత్‌రంగ నిపుణులు చెప్తున్నారు. విద్యుత్ ప్లాంట్లలో ఉత్పాదకత పడిపోతుండటంతో ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వస్తున్నది. అసమర్థ నిర్వహణ, అసంబద్ధ విధానాల ఫలితంగానే ఈ దుస్థితి
తలెత్తుతున్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పారిశ్రామిక ప్రగతి మందగించిం ది. అందుకు విద్యుత్ సంక్షోభమే కార ణం. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా అనేక పరిశ్రమలు తరలిపోయాయి. డిస్కంలకు పరిశ్రమలే వెన్నెము క. కరెంటు చార్జీల పెంపుతో విద్యుత్ వ్యవ స్థ కుదేలవడంతో పాటు పారిశ్రామిక రం గం కూడా కుప్పకూలే ప్రమాదం ఉన్నది. పరిశ్రమలన్నింటినీ ఒకేగాటన కట్టే ప్రయ త్నం చేస్తుండటం కుటీర, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల పాలిట శాపంగా మార నున్నది.
ఒకవేళ విద్యుత్ నియంత్రణ మండలి చార్జీల పెంపు ప్రతిపాదనలను ఆమోదిస్తే తెలంగాణలో మళ్లీ 2014 ముందున్న సంక్షోభ పరిస్థితులు తలెత్తుతాయి. విద్యు త్ కోతలు, చార్జీల పెంపు అంటే ‘బంగారు తెలంగాణ’ను మరోసారి అంధకారంలోకి నెట్టివేయడమే. అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విద్యుత్‌రంగంపై స్పష్టమైన విధా నమంటూ ఏదీ లేదు. విద్యుత్ సమస్యల పై ప్రభుత్వం దాటవేత ధోరణిని అవలంబించడమే అందుకు తార్కాణం.
ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ చార్జీల విషయంటలో ఒంటెత్తు పోకడలకు పోయిన టీడీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. 2000లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీ లు పెంచి జలియన్ వాలాబాగ్ తరహాలో బషీర్‌బాగ్‌లో ఉద్యమకారులపై కాల్పులు జరిపింది. అప్పుడు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్ చార్జీల పెంపును తీవ్రంగా నిరసించారు. బాబు నిర్ణయాలతో ఏకీభవించని కేసీఆర్ అన్ని పదవులకు రాజీనామా చేసి టీడీపీ నుంచి బయటకు వచ్చారు.
విద్యుత్ చార్జీల పెంపు విషయంలో ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడకపోతే ప్రజల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవడం తప్పదు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తుంది. అందుకే, ప్రజలపై పెనుభారం మోపే చార్జీ ల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి.
(వ్యాసకర్త: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్)
– ఎర్రోళ్ల శ్రీనివాస్