అలలపై… పౌర్ణమి నాడు
చల్లని వెన్నెల కురిపించి రేయంతా అలసి సొలసి సొమ్మసిల్లి పోతున్న చందమామ
చల్లని వెన్నెల కురిపించి
రేయంతా అలసి సొలసి
సొమ్మసిల్లి పోతున్న చందమామ
రేయిని చీల్చుతూ విల్లంబులుగా
కిరణాలతో ఉదయిస్తున్న భానుడిని
చూసి సిగ్గుతో తప్పుకున్న చంద్రి
అలలు కిరణాల స్పర్శ తో పులకరిస్తూ
తీరాన్ని తాకాలనే తహ తహతో
తీరం అల చుంబనంకై తమకంతో
తీరే వేళ గాలి హోరు
చుంబనం కాస్తా
సంగమమై తనివి తీరా!! పారవశ్యంలో
ఆమె అతడు
అలా రేయి నుండి పగలు దాకా
వెన్నెల నుండి మండే వేసవి దాకా
కళ్ళతో మాట్లాడుతూ
స్పర్శలో మైమరుస్తూ
ఇలలోనే దొరికే మధురానుభూతుల
లోగిలిలో మౌనంగా
తమదైన లోకంలో
చేతి వేళ్ళతో మీటే
దేహ స్పందనల సంగమం
ప్రకృతి నేర్పిన పాఠమూ!
కోరికనూ!! అదే!!
ఆ దిశలో ఆ ఇద్దరూ
అడుగులు వేస్తూ
అలతీరం ఆలింగనం సాక్షిగా
చెలమల్లు గిరిప్రసాద్: 94933 88201
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

