e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home ఎడిట్‌ పేజీ ఈ గెలుపు కొత్త మలుపు

ఈ గెలుపు కొత్త మలుపు

ఈ గెలుపు కొత్త మలుపు

రాజకీయాలకు అతీతమైన జీవితం లేదు. అవును! మనిషి జీవితాన్ని నిర్ణయించి, నిర్దేశించి, నడిపించేది, నడిపిస్తున్నదీ రాజకీయమే. మనకు ఇష్టమున్నా, లేకున్నా, తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా, అర్థం చేసుకున్నా అర్థం చేసుకోలేకపోయినా- రాజకీయాలు మన జీవితంలో అంతర్భాగం. మన జీవితాలు రాజకీయాధారితం. అయితే, రాజకీయాలు రెండు రకాలు 1.పవర్‌ పాలిటిక్స్‌ (అధికార రాజకీయాలు) 2. ప్రెజర్‌ పాలిటిక్స్‌ (ఒత్తిడి రాజకీయాలు).
ఈ రెండు రాజకీయాల్లోనూ కులం నిర్ణయాత్మ కం. అయితే మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో అణగారిన కులాలు అధికార రాజకీయాలు నడిపే స్థితిలో లేవన్నది వాస్తవం. ఎన్ని ప్రయోగాలు జరిగినా, జరుగుతున్నా ఇంకా మనం అధికార రాజకీయాలపై పట్టు సాధించలేదన్నది సత్యం. ఈ సత్యాన్ని అర్థం చేసుకొని సరైన వ్యూహం, ఎత్తుగడలతో ముందుకుపోవాలి.
కొందరు ఒంటెద్దు పోకడలతో, వ్యక్తిగత స్వార్థంతో, అణగారిన కులాల ప్రతినిధులుగా చెలామణి అయ్యేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ స్వయం ప్రకటిత నాయకులు రాజకీయ పార్టీలతో తెరచాటున లాలూచీ పడి , మన ప్రజలను అమ్ముకోవాలని ప్రయత్నించారు , ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. మనం మేలుకొని కచ్చితమైన నిర్ణయాలను తీసుకోకుంటే గతం మాదిరిగానే ఇకముందూ మోసపోతూనే ఉంటాం.
కత్తి కన్నా తేనె పూసిన కత్తి ప్రమాదకరమ న్నట్టు, బహిరంగ సహకారం కన్నా చీకటి ఒప్పందాలు మహా ప్రమాదకరం. బహిరంగ సహకారంలో మన ప్రజలకు ఒక ప్రశ్నించే హక్కు ఉంటుంది. మన సహకారం పొందిన వారిని నిలదీసే శక్తి ఉంటుంది. అదే చీకటి ఒప్పందాల్లో మన నాయకులమని చెప్పుకొంటున్న వారి స్వలాభం మాత్రమే ఉంటుంది. ఈ పరీక్ష మనకిప్పుడు మరొకసారి ఎదురైంది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక మనం ఎదుర్కొనే పరీక్ష. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్‌ రాజకీయాలకు ఒక బలమైన సంకేతం ఇవ్వబోతున్నది.
సాగర్‌ ఉప న్నికలో కొన్ని కీలకమైన అంశాలు ఇమిడి ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ను గెలిపించడం ద్వారా మత విశ్వాసం వేరు, మతోన్మాదం వేరు అని చాటిచెప్పడం. విభజన రాజకీయాలను ఎదుర్కొంటున్న టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచి దాన్ని బలోపేతం చేయడం ద్వారా మన ప్రజల ప్రయోజనాలను సాధించుకోవడం. ఫ్యూడల్‌ ఏలుబడికి ప్రతినిధిగా ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థిని మన బహుజన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భగత్‌ ద్వారా ఓడించి మన సత్తాను నిరూపించుకోవ డం, మన శక్తిని మరింతగా పెంచుకోవడం.
ఇంతటి కీలకమైన ఈ ఎన్నికల్లో మనమూ కీలకంగా మారుదాం. మనకున్న అపార జనశక్తిని భ్రమల్లో మునగకుండా, ఆ శక్తికి రాజకీయ ఊపిరి పోసేందుకు వ్యూహాత్మకంగా ముందుకువెళదాం. బీజేపీ మనకు ప్రధాన ప్రత్యర్థి. దానికి సమీప ప్రత్యర్థి టీఆర్‌ఎస్‌. కాబట్టి మనం సహకరించాల్సింది, సాయపడాల్సింది టీఆర్‌ఎస్‌కే. రాజకీయంగా ఆలోచించి, ఈ రాజకీయ నిర్ణయం తీసుకుందాం.

ఈ గెలుపు కొత్త మలుపు
Advertisement
ఈ గెలుపు కొత్త మలుపు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement