ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా రైతులు నీళ్ల కోసం తండ్లాడే పరిస్థితి ఉండేది. ఒక్కొక్క రైతు 10 నుండి 15 బోర్లు వేసి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకొనేవారు. కృష్ణా, గోదావరి, వాటి ఉప నదుల నీళ్లు తెలంగా ణ ప్రజలకు దక్కకుండా ఉమ్మడి రాష్ట్ర పాలకులు అడ్డుకొన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కొందరు కోర్టుల్లో కేసులు వేసి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఆలస్యమయ్యేలా చేశారు. ఉద్యమ సమయంలో నీళ్ల గోసను కళ్లారా చూసిన కేసీఆర్ సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజల కష్టాలను తీర్చారు.
ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి ఇరిగేషన్ శాఖ అహర్నిశలు కృషి చేసింది. ఈ ప్రాజెక్టులో 145 మెగావాట్స్ సామర్థ్యం కలిగిన 29 భారీ పంపులు ఉన్నాయి. ఒక్కో మోటార్ నీటి లిఫ్టింగ్ సామర్థ్యం 3 వేల క్యూసెక్కులు. కొల్లాపూర్ మండలం నార్లాపూర్‌లో జరిగిన డ్రై రన్ విజయవంతమైంది. అక్కడ ఏర్పాటు చేసిన ఎనిమిది పంపులు 24 వేల క్యూసెక్కుల నీటిని 106 మీటర్ల ఎగువకు నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేస్తాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు 7.3 టీఎంసీల తాగునీరు, 12.3 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడంతో పాటు మొత్తం 20 లక్షల ఎకరాలకు సాగునీరందించే విధంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. 145 మెగావాట్ల మోటార్ల సాయంతో 60 రోజుల్లో 90 టీఎంసీల నీటిని తోడిపోసుకొని పంట పొలాలను సస్యశ్యామలం చేయొచ్చని నీటి నిపుణులు చెప్తున్నారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఫ్లోరైడ్ ప్రభావం నుంచి 1200 లకు పైగా గ్రామాలకు విముక్తి కలగనున్నది. సీఎం కేసీఆర్ కార్యదక్షత, దూరదృష్టి వల్ల తొమ్మిదిన్నరేండ్ల స్వల్ప కాలంలోనే తెలంగాణ పచ్చని మాగాణిగా మారింది. తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లా కు సాగునీటితో పాటు తాగునీటిని అందించాలనే లక్ష్యంతో శ్రీకారం చుట్టిన ఈ ప్రాజెక్టు మొదటి దశలో తాగునీటి ఎద్దడిని పూర్తిగా తీర్చాలని నిర్ణయించింది. రెండో దశలో సాగు నీటికి సంబంధించిన పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగింది. ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ప్రభుత్వం వాటన్నింటినీ అధిగమించి పూర్తి చేసింది. నీళ్ల గోస పెట్టిన కాంగ్రెస్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నత్తనడకకు కారణమైంది. ఇప్పుడు అధికా రం కోసం రైతు డిక్లరేషన్ పేరుతో దగా చేస్తున్నది. అ యితే సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నంతో వ్యవసాయం దండగ అన్న చోటనే పండుగగా మారింది. దశాబ్ది కా లంలోనే కోటి ఎకరాల పచ్చ ని మాగాణమైంది. నాడు పడావు పడ్డ భూములు.. నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి.