మట్టి (కొట్టుకుపోయిన) మనిషి!
వానల ద్రోహం, ఎండల దాహం మధ్య రైతు నడక ఆగదు భూమి ఒంటిపై పడిన ప్రతి చెమట చుక్క కాలగర్భంలో నిలిచే విత్తు ఔతుంది.
వానల ద్రోహం, ఎండల దాహం మధ్య
రైతు నడక ఆగదు
భూమి ఒంటిపై పడిన ప్రతి చెమట చుక్క
కాలగర్భంలో నిలిచే విత్తు ఔతుంది.
పగలు తన పొలంలో తనే కూలీ శ్రమ,
రాత్రి కడుపునిండా తింటాననే భ్రమ
ఆశల అగ్గిపుల్లను ఆరనీయని గుండె రైతుదే.
అది నిశ్శబ్ద వీరత్వం.
తన కష్టానికి విలువ ఇవ్వని
రాజకీయాలకూ, సమాజానికీ
నిశ్శబ్దంగా సమాధానం చెప్పే వాడే రైతు.
పూచే పువ్వులోను, ఉడికే అన్నంలోను
అతని చెమట సువాసనే ఉంటుంది.
జాతి ఊపిరి అతనే, భూమి బిడ్డ అతనే
రైతు నిలిచి ఉన్నంత వరకూ
దేశం నిలబడి ఉంటుంది.
ఎండతో యుద్ధం, వానతో సందేహం,
సంతల్లో ఆరాటం యార్డుల్లో పోరాటం
అన్నీ అతని నిత్య సహచరాలు.
వెన్నెలలోనైనా, వానగాలిలోనైనా,
తన నేలతో విడిపోని మనిషి రైతు.
కాళ్లల్లో పగుళ్లు పడ్డా అతని గుడిసెల మీద
ఇంకా పేదరికపు లాంతరు వెలుగుతుంది.
మంచు పడితే పంట పాడవుతుంది,
ఎండ ఎక్కువైతే నేల ఎండిపోతుంది,
వానలు విరుచుకుపడితే వరదలు,
రైతు ప్రతిసారీ లేచి నిలబడతాడు,
మెట్టపొలంలో దేశపు శ్వాస నాటబడి ఉంటుంది.
అతని బాధకు బడ్జెట్లలో స్థానం – స్థానచలనమే!
రైతు మట్టికొట్టుకునే ‘వేళ్ల’ కు పుట్టినవాడు.
తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి
80085 77834
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

