అతన్ని తలవకుండా ఉండలేను
తలిస్తేగాని గొంతులో ముద్ద దిగదు…
కాళ్లు తడవకుండా
సముద్రాన్ని దాటగలను…
కళ్లు మూయకుండా
కలలు కనగలను…
కానీ మదిలో
తన బొమ్మను.. తీసెయ్యలేను
కనుల కొలనులో
ఆకుపచ్చని చట్టై
నిత్యం ఆయన దర్శనం..
అతడు.. ఆకుతొడిగిన వసంతం
పరుగులు తీస్తూ
పాల నురుగులు కక్కుతూ
ప్రవహించే జీవనది..
మట్టి సింహాసనంపై
కొలువు దీరిన మహారాజు
అతనొక కాంతి కిరణం
ఆరిపోని మా ఇంటి దీపం
–ఉప్పరి తిరుమలేష్
9618961384