పాలకులకు విజన్ (దూరదృష్టి) ఉంటే ప్రజలకు సుదీర్ఘకాలం మేలు జరుగుతుంది. చరిత్రలో ఎంతోమంది నాయకులు దీన్ని నిరూపించారు. తెలంగాణ సాధన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆ దిశగానే పయనిస్తున్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నారు. ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా రాష్ర్టాన్ని సమగ్రాభివృద్ధి పథాన నడిపిస్తున్నారు.
తేడాది పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఒక ఆశయాన్నిచ్చింది. పర్యావరణ వ్యవస్థలను కాపాడటం, నాశనమైనవి పునర్వవస్థీకరించుకోవడం, తద్వారా భూగ్రహాన్ని పునరుద్ధరించడం. ఈ పని సజావుగా జరగాలంటే, ఐరాసలో భాగస్వామ్య దేశాలన్నీ కలిసి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను కాల పరిమితిలోగా అందుకోవాలని నిర్దేశించింది. 2030 లక్ష్యాలను సాధించాలని డెడ్‌లైన్ కూడా పెట్టుకున్నాయి.
ఐరాస రూపొందిన లక్ష్యాల సాధనకు అన్ని దేశాలు శ్రీకారం చుట్టాయి. అయితే అప్పుడే పుట్టిన తెలంగాణ రాష్ట్రం ఐరాస లక్ష్యాల (ఎస్డీజీఎస్) దిశగా వేగంగా పయనిస్తుండటం గమనించాల్సిన అంశం. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో పురోగమిస్తున్న తీరు జాతీయస్థాయిలో ప్రశంసలందుకుంటున్నది. నీతి ఆయోగ్, ఆర్థికశాఖ సర్వేల్లో తెలంగాణ సాధిస్తున్న ప్రగతి ఏటికేడు మెరుగుపడుతున్నది. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను స్పష్టం చేస్తున్నది. ఏటా బడ్జెట్ సమావేశాలకు ముందు పార్లమెంటులో ప్రవేశపెట్టే ఆర్థిక సర్వేనే దీనికి సాక్ష్యం.
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిలో తెలంగాణ ఫ్రం ట్ రన్నర్ జాబితాలో నిలిచింది. భారత సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సూచి నివేదికను ఏటా నీతి ఆయోగ్ విడుదల చేస్తుంది. నీతి ఆయోగ్ మొత్తం 17 లక్ష్యాల్లో 13 లక్ష్యాలనే ప్రాతిపదికగా తీసుకుంటుంది. (12, 13, 14, 17 లక్ష్యాలను లెక్కలోకి తీసుకోదు). దేశంలోని అన్ని రాష్ర్టాలు-కేంద్ర పాలిత ప్రాంతాల పురోగతిని ఈ లక్ష్యాల ఆధారంగా 62 జాతీయ సూచికలతో నీతి ఆయోగ్ మదింపు చేసి ఆర్థికసర్వేలో వెల్లడిస్తుంది. ఐరాస రూపొందించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 2030 అమలు దిశగా రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల పురోగతి ఆధారంగా ఈ నివేదిక రూపొందిస్తుంది. తొలిసారిగా 2018లో ఈ సూచిని రూపొందించిన నీతిఆయోగ్.. ఈ సూచి రాష్ర్టాల మధ్య పోటీతత్వాన్ని పెంచాలని ఆకాంక్షించింది. 2018లో 9వ స్థానంలో ఉన్న తెలంగాణ 2019లో 67 స్కోరుతో మూడో స్థానానికి చేరింది. 2021లో 69 పాయింట్లతో ఫ్రంట్ రన్నర్‌గా నిలిచింది. ఈ పురోగతి దేశ సగటు కన్నా ఎక్కువే కావడం విశేషం. ఐరాస నిర్దేశిత లక్ష్యాల ప్రకారం మొత్తం 17 అంశాల ఆధారంగా సుస్థిరావృద్ధి లక్ష్యాలను గణిస్తారు.
అవి.. 1.పేదరిక నిర్మూలన, 2.ఆ కలి తీర్చడం, 3.చక్కటి ఆరోగ్యం-ప్రజాశ్రేయస్సు, 4.నాణ్యమైన విద్య, 5.లింగ సమానత్వం, 6.స్వచ్ఛమైన తాగునీరు-పారిశుధ్యం, 7.చౌకైన పర్యావరణ అనుకూల ఇంధన వినియోగం, 8.అందరికీ ఉపాధి-ఆర్థికవృద్ధి, 9.పరిశ్రమలు-ఆవిష్కరణలు-మౌలిక వసతులు, 10.అసమానతల తగ్గింపు, 11.సుస్థిర నగరాలు-సమూహాలు, 12. బాధ్యతాయుతమైన వినియోగం-ఉత్పత్తి, 13.పర్యావరణ చర్యలు, 14.నీటి లోపలి జీవవనరులు, 15.భూ మిపై జీవావరణం, 16.శాంతి-న్యాయం-పటిష్టమైన సంస్థలు, 17.లక్ష్యాల కోసం భాగస్వామ్యం.
సుస్థిర-సమగ్రాభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సూచిలో 100కు 100 పాయింట్లు వస్తే అచీవర్ స్టేట్స్. 65 పాయింట్లకు పైగా సాధిస్తే ఫ్రంట్ రన్నర్‌గా. 50కి పైగా పాయింట్లు సాధిస్తే ఫర్ఫార్మర్ జాబితా. 50 కంటే తక్కువ పాయింట్లు వస్తే ఆస్పిరెంట్ జాబితాలో సూచిస్తారు. కేంద్రం విడుదల చేసిన ఆర్థికసర్వేలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన పురోగతిని కూడా వివరించింది. రాష్ర్టాల వారీగా ఆయా లక్ష్యాల సాధనలో ప్రస్తుత స్థితిని స్పష్టం చేసింది.
75 స్థానాలతో కేరళ అగ్రస్థానంలో నిలవగా, 69 పాయింట్లతో తెలంగాణ, గుజరాత్‌లు ఆరో స్థానంలో నిలిచా యి. ఇది జాతీయ సగటు కంటే 3 పాయింట్లు ఎక్కువ కావడం తెలంగాణ ప్రగతికి సూచిక. మొత్తం 8 లక్ష్యాల్లో తెలంగాణ జాతీయ సగటును అధిగమించింది. అఫర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీలో వంద పాయింట్లు సాధించింది.
ఇక రక్షిత మంచినీరు, పారిశుధ్యం విషయంలో 96 పాయింట్లు సాధించింది. భూమిపై జీవనానికి సంబంధించిన 15 లక్ష్యాలకు గాను అఫర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ విషయంలో వంద పాయింట్లు సాధించింది. పరిశుభ్రమైన నీరు, పారిశుధ్యం విషయంలో 96 పాయింట్లు సాధించింది. భూమిపై జీవనానికి సంబంధించి 81 పాయింట్లు వచ్చాయి. 65కు పైగా పాయింట్లతో 9 లక్ష్యాల విషయంలో ఫ్రంట్ రన్నర్‌గా నిలిచింది. 50కి పైగా పాయింట్లతో మూడు లక్ష్యాలకు సంబంధించి పర్ఫార్మర్ జాబితాలో నిలిచింది. 8 లక్ష్యాల్లో జాతీయ సగటును అధిగమించింది. 2011 నుంచి 2021 వరకు హైదరాబాద్‌లో అటవీ విస్తీర్ణం భారీగా పెరిగినట్లు ఆర్థిక సర్వే తెలిపింది. దేశంలో మరే రాష్ట్రం సాధించని ఘనత తెలంగాణ సాధించింది.
–(వ్యాసకర్త: టీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్)
ఇలా.. బహుముఖ వ్యూహంతో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి తగిన ఫలితం దక్కింది. ఈ ఏడున్నరేండ్ల పాలనలో ఎన్నో రాజకీయ ఆటుపోట్లను ఎదుర్కొని, కాలపరీక్షకు ఎదురునిలిచి సాధించిన ఈ విజయం కేసీఆర్ విజనరీ అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. దేవభూమి అయిన కేరళ అన్నింటా అగ్రస్థానంలో నిలవడం పెద్ద విశేషం కాదు. కానీ నిన్నగాక మొన్న పుట్టిన తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచే పథకాలతో ఐరాస నిర్దేశించిన గ్లోబల్ గోల్స్‌ను అందుకుంటూ దూసుకుపోతుండటమే విశేషం.
–వై.సతీష్‌రెడ్డి 9641466666