నిలిచి తీరుతాడు
ఆలోచనతో పరిశీలనతో
అవగాహనతో
గెలిచి చూపిస్తాడు
ప్రయాణం సాగనీ
అవివేకులు గోలపెట్టినా
అసమర్థులు గొడవ చేసినా
సురక్షితంగా సమర్థంగా
లక్ష్యం దిశగా.. గమ్యం చేరువగా
అడుగులు పడనీ
‘గోదావరి’ని ‘కావేరి’ని
కలుపుకొని సాగనీ
మార్క్స్ వాదం సోషలిజం
రెండు కళ్లతో
తాపత్రయమన్నా
తాహతు మించిన యత్నమన్నా
నూరారు ప్రణాళికలతో
నూతన శకారంభం జరగనీ
కొత్త చిగుర్లతో ఉపిరిపోసి
ఆశల్ని రగిల్చి శక్తులన్నీ కూడదీసుకొని
వెన్నెల హారతి ఇవ్వడానికి
అభిమానులతో భూగోళం సిద్ధమైంది
కులం గోడలు, మతం మేడలు కూలనీ
స్వప్నాలు పూలై పూసే వేళ
పూ పరిమళాలు ప్రపంచాన్ని
ముద్దాడే వేళ
ప్రత్యామ్నాయ మాట
ప్రగతిశీల బాట…
-కోటం చంద్రశేఖర్ , 94920 43348