పల్లవి: ఇదిగిదిగో ఇదేరా అసలు సిసలు తెలంగాణ
ఇదిగో ఇటు చూడరా మనము కలలుగన్న తెలంగాణ
ఇదిగిదిగో ఇదేరా మన అస్తిత్వపు తెలంగాణ
ఇదిగో ఇటు చూడరా మన ఆత్మగౌరవ తెలంగాణ
॥ఇదిగిదిగో ॥
చరణం: అమరుల ఆత్మార్పణలతో, సకలజనుల సమ్మెలతో
విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారుల ఐక్యతతో
రాజకీయ దీక్షలతో పదేపదే పదవుల త్యాగాలతో
శాంతి, అహింస మార్గాన సాధించుకున్న తెలంగాణ
॥ఇదిగిదిగో ॥
చరణం: మన బతుకమ్మ బోనాలు పండుగలు పబ్బాలు
మన కట్టుబొట్టు యాసల ఆచార వ్యవహారాలు
ధూంధాం ఆటలు, పల్లె జానపదాల పాటలు
అన్నింటా ప్రత్యేకం దేశానికి మనమాదర్శం
॥ఇదిగిదిగో ॥
చరణం: రైతుబంధు, దళితబంధు, ఆసరా పింఛన్లు
మిషన్ కాకతీయ, భగీరథులు, కాళేశ్వర ప్రాజెక్టులు
డబుల్ బెడ్రూంలు, బస్తీ దవాఖానలు
పల్లె పట్టణ ప్రగతి, బడి బాటలు, హరితహారములు
షాదీముబారక్లు, కేసీఆర్ కిట్టులు
అదీ ఇదీ కాదుగని- అన్నింటికన్నీ ‘పానిండియా పథకాలే’
॥ఇదిగిదిగో ॥
జై బోలో తెలంగాణ
-పి.గంగాధర్, 73969 32942