చూడు చూడు తెలంగాణ చూడు
నాటి నేటి తేడా నవ తెలంగాణ చూడు
హరితహారం తోటి ఆనందాలు చూడు
పల్లె వనం ప్రగతి పార్కులను చూడు…
కన్నతల్లికి బరువు కట్నకానుకలు
కళ్యాణ లక్ష్మితో కష్టాలు తీర్చిండు
చూడు చూడు తెలంగాణ చూడు
బాధలు తీరిన బతుకులు చూడు…
నీరుతో చెరువంత నిగనిగలాడుతున్నది
వాగుల్లో ఒంపుల్లో నీరు పారుతున్నది
కరువుతీరి పల్లె వలసబతుకు ఆగింది
పాడుబడ్డ భూమి పంట పండుతున్నది
చూడు చూడు తెలంగాణ చూడు
నాటి నేటి తేడా నా తెలంగాణ చూడు
రాష్ట్రం వచ్చినాక రైతుబంధు చూడు
రైతుబంధు తోటి రైతన్నకు మేలు
పల్లె నేల అంతా పచ్చగా ఉన్నది
వద్దనక వరిపంట ముద్దుగా పండుతున్నది
పత్తి పంటకు నీరు ప్రాణం పోస్తున్నది
చెలక భూములన్ని సిరులు కురిసే
చూడు చూడు నాటి నేటి తేడా
నవతెలంగాణ బంగరు తెలంగాణ చూడు
-దేవరపాగ కృష్ణయ్య ,99634 49579