ములుగర్రకు పనివడంగా…
మూలకున్న నులకమంచం లే.. లెమ్మనంగ…
సద్దిమూటలు సప్పుడు జేయంగ…
జోడేడ్ల్ల బండ్లు రంకెలేయంగా..
నెత్తికి రుమాలు సుట్టే మల్లన్న..
గోసి చీర కట్టి ముందుకు నడిసే నర్సక్క…!
చెక్కులిచ్చే మా సారుండంగ
చేయి సాపి పైసలడిగే గోసెక్కడిది మాకింక…
ఏసంగి నాగలి వట్ట బైల్లెల్లె మా రైతన్న…
పసిడి పండించే భాగ్యమాయే మా తెలంగాణలో…
పుడమి తల్లికి పురుడు పోయమని
ధాన్యలక్ష్మి ఎదురుచూసే…
ఆడబిడ్డల వెంట్రుకల చిక్కులముడి విప్పినట్టు…
మా కట్టాల మోపు ఒక్కొక్కటి దించిండు
మా కేసీఆరు సారు…
ఎకరానికి ఐదు వేలిచ్చె..
మా చేతి ఐదు వేల్లు నోట్లెకు పోయే..
ప్రకృతి బీభత్సాలతో యుద్ధం చేసేది మా రైతైతే…
తెలంగాణ రైతుల కోసం
పచ్చటి నారై మొలిచేది
మా కేసీఆర్ సారే…
రైతుబంధు అయ్యెను..
మా రైతన్నలకు ‘రక్షణబంధు’..
(ఏసంగి పంటలు బాగా పండాలని కోరుతూ ‘రైతు బంధు’ విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు వేన వేల
శనార్థులు..)
-తుమ్మల కల్పనరెడ్డి ,96404 62142