BRS Maha Dharna | ఏపీ జలదోపిడీని అడ్డుకునే సోయి లేదా..? సాగునీటి కోసం హుజూర్నగర్, నేరేడుచర్లలో రైతుల మహా ధర్నా
పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ జలదోపిడీ చేస్తున్నా రేవంత్ ప్రభుత్వానికి పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ హు జూర్‌నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటె ద్దు నర్సింహారెడ్డి ఆరోపించారు. నాగార్జునసాగర్ నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్, నేరేడుచర్లలో రైతు మహాధర్నా చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని 7 మండలాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులతోపాటు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
- మన రైతును ఆదుకోవాలనే ధ్యాసేది?
- బీఆర్ఎస్ నేత నర్సింహారెడ్డి ఆగ్రహం
- సాగునీటి కోసం హుజూర్నగర్, నేరేడుచర్లలో రైతుల మహా ధర్నా
నేరేడుచర్ల, ఆగస్టు 26 : పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ జలదోపిడీ చేస్తున్నా రేవంత్ ప్రభుత్వానికి పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ హు జూర్‌నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటె ద్దు నర్సింహారెడ్డి ఆరోపించారు. నాగార్జునసాగర్ నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్, నేరేడుచర్లలో రైతు మహాధర్నా చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని 7 మండలాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులతోపాటు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
నే రేడుచర్ల చౌరస్తాలో నిర్వహించిన రైతు ధర్నాలో గరిడేపల్లి, పాలకవీడు, నేరేడుచర్ల మండలాలకు చెందిన రైతులు, హుజూర్‌నగర్‌లో నిర్వహించిన ధర్నాలో మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపా లెం, హుజూర్నగర్ మండలాలకు చెందిన రైతు లు పాల్గొన్నారు. ఆంధ్రా జల దోపిడీని అరికట్టాలని, సాగర్‌నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని, సారే కావాలని, కారే రావాలని పెద్ద ఎత్తున నినదించారు. ఆయా కార్యక్రమాల్లో ఒంటెద్దు నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. మిగులు జలాలను మాత్రమే వాడుకోవాలని నిబంధనలు ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వచ్చిన వరద నీటిని మొత్తం తెలంగాణకు రాకుండా అక్రమంగా తరలించుకుపోతున్నదని మండిపడ్డారు.
ఆంధ్రా సర్కార్ 30 రోజుల్లో కనీసం 40 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోతే తెలంగాణకు కేవలం 9 టీఎంసీల నీటిని మాత్రమే విడుదల చేశారని ఆందోళన వ్యక్తంచేశారు. కేసీఆర్ ఉన్న సమయంలో తెలంగాణలోని రైతులు సుఖసంతోషాలతో జీవించారని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో గోస పడుతున్నారని తెలిపారు. రైతుల ప్రయోజనాలను పట్టించుకోకుండా తెలంగాణ అస్థిత్వాన్ని ఏపీ సీఎం చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. సాగర్ నీరు వస్తుందనే నమ్మకంతో ముందస్తుగా బోర్లు, బావుల కింద నాట్లు వేసిన రైతులు సరిపడా నీరు లేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

