నిందలు.. చిందులు!
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంవత్సరమే పాలనా దిశను నిర్ణయిస్తుంది. ఆ కాలంలో తీసుకున్న నిర్ణయాలు, అమలుచేసిన విధానాలు, చూపిన పరిపాలనా శైలి ప్రజల నమ్మకానికి పునాది అవుతాయి. కానీ, తెలంగాణలో ప్రస్తుతం కనిపిస్తున్న పాలనా పరిస్థితులను చూస్తే, సమస్యల పరిష్కారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ సమర్థతపై ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంవత్సరమే పాలనా దిశను నిర్ణయిస్తుంది. ఆ కాలంలో తీసుకున్న నిర్ణయాలు, అమలుచేసిన విధానాలు, చూపిన పరిపాలనా శైలి ప్రజల నమ్మకానికి పునాది అవుతాయి. కానీ, తెలంగాణలో ప్రస్తుతం కనిపిస్తున్న పాలనా పరిస్థితులను చూస్తే, సమస్యల పరిష్కారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ సమర్థతపై ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పష్టమైన చిత్రాన్ని ప్రజలకు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని వస్తున్న విమర్శలు సహేతుకమైనవే. అప్పులు, ఆదాయ వనరులు, ఖర్చుల ప్రాధాన్యాలు ఈ అంశాల్లో పారదర్శకత కొరవడటం అనిశ్చితిని పెంచుతున్నది. సమస్యను గుర్తించడం ఒక దశ అయితే, దానికి సరైన కార్యాచరణ రూపొందించడం అసలు పరీక్ష. ఆ పరీక్షలో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిలబడలేకపోయిందని రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు విశ్వసిస్తున్నారు. రైతాంగ సమస్యలు తెలంగాణకు మూలస్తంభం వంటివి. సాగునీరు, ఎరువులు, పెట్టుబడి సాయం, పంటలకు గిట్టుబాటు ధర రైతు జీవితానికి సంబంధించిన వాస్తవాలు. అయితే రైతు సమస్యలపై తీసుకున్న చర్యలు తాత్కాలికంగా కనిపిస్తున్నాయి తప్ప, దీర్ఘకాలిక పరిష్కారాలుగా మారలేకపోతున్నాయి.
నిరుద్యోగ యువత పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తున్నది. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఉద్యోగాల భర్తీపై ఇచ్చిన హామీలుగానే ఇచ్చినట్టే ఉన్నాయి. ప్రకటనల కోసం యువత ఎదిరిచూస్తున్నది. ఈ పరిస్థితిలో పాలనపై ప్రజల్లో నమ్మకం దెబ్బతిన్నది. పరిపాలనలో స్థిరత్వం కూడా ఒక కీలక అంశం. తరచూ మారుతున్న ప్రకటనలు, విభిన్న వ్యాఖ్యలు, ఒకదానికొకటి పొంతన లేని నిర్ణయాలు ప్రభుత్వ దిశపై సందేహాలు కలిగిస్తున్నాయి. విమర్శలకు సమాధానంగా విమర్శలే చేయడం పాలనకు ప్రత్యామ్నాయం కాదు.
ప్రజలు కోరేది స్పష్టమైన విధానం, స్థిరమైన నిర్ణయాలు. కానీ ప్రభుత్వం ఈ సోయి మరిచిపోయి వ్యవహరిస్తున్నది. నాయకత్వం అంటే సమస్యలకు ఇతరులపై నిందలు వేయడం, చిందులు వేయడం కాదు, బాధ్యతగా వ్యవహరించడం. గత ప్రభుత్వాలపై ఆరోపణలు చేస్తూ కాలం గడిపితే వర్తమాన సమస్యలకు పరిష్కారం దొరకదు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతుల దూకుడు తగ్గించుకొని, పాలనలోని లోతులను తెలుసుకోవాలి. సమర్థతను కార్యాచరణ ద్వారా నిరూపించుకోవాలి. పనిలో నిమగ్నమైనప్పుడే బూతు మాటలు నోటి నుంచి రాకుండా ఉంటాయి. ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే.. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఏ ప్రకటన చేస్తాడో అని ప్రజలు వేచిచూసే సమయం రావాలి. అది రేవంత్ జీవితంలో సాధ్యమయ్యే పనికాదు.
-కళ్ళెం నవీన్‌రెడ్డి ,99636 91692
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

