సైబర్ భద్రత
భారతదేశం గత దశాబ్దకాలంగా సైబర్ ప్రపంచంలో పెద్దపెద్ద అంగలు వేస్తున్నది. ప్రజలకు స్మార్ట్ ఫోన్లు, డేటా విరివిగా అందుబాటులోకి రావడంతో సమాచార వ్యాప్తి రాకెట్ వేగం అందుకున్నది. అయితే సౌకర్యాల విస్తరణలో సమస్యలు వెన్నంటే ఉంటాయి.
భారతదేశం గత దశాబ్దకాలంగా సైబర్ ప్రపంచంలో పెద్దపెద్ద అంగలు వేస్తున్నది. ప్రజలకు స్మార్ట్ ఫోన్లు, డేటా విరివిగా అందుబాటులోకి రావడంతో సమాచార వ్యాప్తి రాకెట్ వేగం అందుకున్నది. అయితే సౌకర్యాల విస్తరణలో సమస్యలు వెన్నంటే ఉంటాయి. దీనికి కృత్రిమ మేధ తోడుకావడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఆన్లైన్ సమాచార మార్పిడి విస్తరిస్తున్న కొద్దీ సైబర్ మోసాలూ పెచ్చరిల్లుతున్నాయి. డీప్‌ఫేక్ అనేది ఓ బెడదగా మారడం మనం చూస్తున్నాం.
వెండితెర తార రష్మిక మందన్న నకిలీ వీడియో ఉదంతం ఓ కనువిప్పు. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో డీప్‌ఫేక్ వీడియోలు హల్చల్ చేయడం తెలిసిందే. ఏకంగా కేంద్ర హోంమంత్రి ఫేక్ వీడియో ప్రచారంలోకి రావడం సంచలనం కలిగించింది. ఇవి వ్యక్తుల పరువు మర్యాదలకు, రాజకీయ భావజాలాలకు సంబంధించిన సమస్యలు. ఇవి కాకుండా ఆర్థికపరమైన సమస్యలూ ఉన్నాయి. ఆన్లైన్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ దొంగలూ విజృంభిస్తున్నారు.
వ్యక్తులతో పాటుగా సంస్థలూ ఈ డిజిటల్ దోపిడీలకు బలవుతున్నాయి. ఈ మోసాల కారణంగా ఆన్లైన్ చెల్లింపులు అంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తున్నది. ఓ అంచనా ప్రకారం 2023లో రూ.7,488 కోట్ల మేర సైబర్ మోసాలు నమోదయ్యాయి. 2024లో ఇప్పటివరకు 1750 కోట్ల రూపాయలు సైబర్ మోసాల్లో స్వాహా అయిపోయాయి. కంప్యూటర్‌కు, ఇంటర్నెట్ తోడైనప్పటి నుంచీ సమాచార చౌర్యం సమస్య ఉండనే ఉన్నది. అనునిత్యం కొత్త మార్పులు చోటుచేసుకునే డిజిటల్ రంగం ఇటు ప్రభుత్వ వ్యవస్థలకు, అటు సాంకేతిక నిపుణులకు అనూహ్యమైన సవాళ్లు విసురుతున్నది. సమాచారానికి, సంపదకు రక్షణ కల్పించడం తలనొప్పిగా మారింది.
ఈ సమస్యను ఎదుర్కోవడంలో చట్టపరమైన సమస్యలు చాలానే ఉండేవి. నేరాల నియంత్రణకు, విచారణకు అవసరమైన డిజిటల్ నిబంధనలు పాతచట్టాల్లో లేకపోవడం ఓ అడ్డంకిగా ఉండేది. అందుకే ఇటీవల తెచ్చిన శిక్షా స్మృతి చట్టాల్లో కేంద్రం డిజిటల్ అంశాలు చేర్చింది. రాతకోతల స్థానే డిజిటల్ నమోదులకు ఆస్కారం కల్పించింది. డిజిటల్ సాక్ష్యాలను ద్వితీయ శ్రేణి నుంచి ప్రథమ శ్రేణికి తీసుకువచ్చారు. సమర్థవంతంగా సాక్ష్యాలను సేకరించడం, కోర్టులో ప్రవేశపెట్టడంలో ఇది ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పవచ్చు. తద్వారా సైబర్ మోసాల విచారణను ఇది వేగవంతం చేస్తుందనడంలో సందేహం లేదు. అయితే సర్కారు సేకరించే డాటా విషయంలో సందేహాలున్న మాట వాస్తవం. విచారణల పేరిట బాహాటంగానో, గోప్యంగానో తన ఆధీనంలోకి తీసుకునే డాటా దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. వ్యక్తుల గోప్యత హక్కు విషయంలో రాజీ పడటం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు.
వజ్రాన్ని వజ్రంతోనే కోసినట్టు, ఆధునిక సాంకేతికతతో జరిగే నేరాలను ఎదుర్కొనేందుకు ఆ స్థాయి సాంకేతిక ప్రజ్ఞాపాటవాలు అవసరమవుతాయి. ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నది. మరీ ముఖ్యంగా ఏఐ సాంకేతికత అవసరం అంతకంతకూ పెరుగుతున్నది. ఇది ఉపాధి అవకాశాలపై సకారాత్మక ప్రభావం కలిగిస్తుందని చెప్పక తప్పదు. కేంద్రం ఈ దిశగా దృష్టిసారించి ప్రోత్సాహకాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. చట్టాలు, రక్షణ వ్యవస్థలు ఎన్ని అందుబాటులో ఉన్నప్పటికీ పరిష్కారం కన్నా నివారణే ఉత్తమమన్నది ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలి. నిరంతర అప్రమత్తతే డిజిటల్ ప్రపంచంలో అన్నిరకాల సమస్యలను దూరంగా ఉంచుతుంది.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

