పల్లవి: అన్నో కాపాడరావె
కేసీయారో నిన్నిడిసిపోమె
బాపో కాపాడరావె
కేసీయారో నిన్నిడిసిపోమె
॥చ॥ కావు కావు మంటు పక్షుల రోదనలు
కావ రావేయంటు పేదలాక్రందనలు
తప్పు జరిగిపోయి తిప్పలౌతున్నది
కాంగిరేసు కాలనాగయ్యి కరిసింది //అన్నో//
॥చ॥ నమ్మి నానబోత్తె పుచ్చి బుర్రలాయె
మంది మాటలింటే ఇల్లూ ఆగమాయె
ఎండమావుల నమ్మి కుండ పగులకొట్టుకుంటె
కష్టమెరుగని బతుకు కన్నీళ్ల పాలాయె //అన్నో//
॥చ॥ గల్లీలేసుకున్న గుడిసె కూలిపాయె
పచ్చాని అడవిడిసి జీవులేడుపాయె
గూడు చెదిరిపాయె గుండెలవిసిపాయె
డోజర్ల రాజ్యంల బజార్ల బతుకాయె //అన్నో//
॥చ॥ కేసీఆర్ నీళ్లు కుట్రలకు బలియాయె
అలుగు దునికే చెరువు మత్తడాగిపాయె
నాటు పెట్టిన రైతు కన్నీటి పాలాయె
పొట్టకొచ్చిన వరి పానమిడిసీపాయె //అన్నో//
॥చ॥ ఆసరా వెన్నులో బరిసాయె భరోసా
ఆత్మ బంధువొదిలి రాబందులు తలిగే
కరువుతో కులవృత్తులన్ని కూలిపాయే
అమ్మబోతె అడివి కొనబోతె కొరివాయె //అన్నో//
పరువు తెర్లయిపాయే పతార పడిపాయె
కక్షలతో పాలన హింసలపాలాయె
తొండికూతలతోని తిండికీ కరువాయె
కండ్లు తెరిసే సరికి కడగండ్ల పాలాయే //అన్నో//
॥చ॥ తెలంగాణ తెచ్చి తెలివితో నిలబెట్టి
లోకానికి మన సత్తువా జూపెట్టే
మా కడుపు నింపి తల్లోలె నువు సూసుకుంటె
మోసపోతిమీ మీము మందిని కూసోబెట్టి //అన్నో//
॥చ॥ ఆశపడ్డముగాని గోసైతదనుకోలె
మాయమాటలతోని ముంచుతాడనుకోలె
మంటి పనికైన ఇంటోడే కావాలె
కేసీఆరే మల్ల సీఎంగా రావాలె // అన్నో//