మనసుంటే మార్గముంటది
మనసుంటే మార్గం ఉంటుంది. ఆశయం కోసం నిరంతరం కృషి చేసినప్పుడు అనుకున్నది సాకారమవుతుంది. డబ్బు లేదని చింతించకుండా ఉన్న వనరులతో సాధన చేస్తే విజయం పాదాక్రాంతమవుతుంది.
మనసుంటే మార్గం ఉంటుంది. ఆశయం కోసం నిరంతరం కృషి చేసినప్పుడు అనుకున్నది సాకారమవుతుంది. డబ్బు లేదని చింతించకుండా ఉన్న వనరులతో సాధన చేస్తే విజయం పాదాక్రాంతమవుతుంది. అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. వీటికి నిలువెత్తు నిదర్శనం.. వైద్య విద్యార్థిని హారిక.
మనం ఏదైనా కావాలని బలంగా కోరుకున్నప్పు డు యావత్ ప్రపంచం అందుకు సహకరిస్తుందని ఇంగ్లిష్ రచయిత ఆస్కార్ వైల్డ్ అంటారు. జీవితంలో అద్భుతమైన విషయం అదేనంటారు. హారిక ఆస్కార్ వైల్డ్ మాటలకు ఉదాహరణగా నిలుస్తుంది. ఏకలవ్యుడి వారసురాలిగా అందరి ప్రశంసలందుకుంటున్న హారిక నిజామాబాద్ నాందేవ్గూడ వాస్తవ్యురాలు. ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో ఆమె అఖిల భారతస్థాయిలో 40 వేల ర్యాం కు, రాష్ట్రస్థాయిలో 700 ర్యాంరే సాధించింది. హారిక కథ వింటే స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. హారిక తండ్రి సతీష్‌కుమార్ ఆమె చిన్నతనంలోనే మరణించారు. దీంతో తల్లి అనురాధ బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నది. హారిక చిన్నప్పటి నుంచి చదువులో అందరి కంటే ముందుండేది. ఆమె 7వ తరగతి చదువుతున్నప్పుడు తనకు డాక్టర్ కావాలనే కోరిక కలిగిందని చెప్పింది. ఈ కోరిక టీచర్లకు, కుటుంబసభ్యులకు ఆశ్చర్యం కలిగించినా ఆమె ప్రతిభను చూసి ప్రోత్సహించారు.
డాక్టర్ కావాలనే లక్ష్యంతో పట్టుదలగా చదివిన హారిక 10వ తరగతి, ఇంటర్లో మంచి మార్కులతో ఉతీర్ణత సాధించింది. ఆశయ సాకారం కోసం నీట్ పరీక్ష రాయాలనుకున్నది. కానీ ఆ పరీక్షకు సన్నద్ధం కావడానికి, అవసరమైన శిక్షణ తీసుకోవడానికి ఆమె దగ్గర డబ్బుల్లేవు. అయినా హారిక నిరుత్సాహం చెందలేదు. తల్లి ప్రోత్సాహంతో ముందడుగు వేసింది. ప్రతి రోజూ యూట్యూబ్‌లో ఉండే వీడియోక్లాసులు వింటూ నీట్ పరీక్షకు సిద్ధమైంది. సొంత కంప్యూటర్ కూడా లేని హారిక స్మార్ట్‌ఫోన్ లోనే పాఠాలు వింటూ సొంతంగా నోట్స్ రాసుకుంది. తన ఆశలు నెరవేర్చకునేందుకు అహర్నిశలు కృషిచేసింది. ఆత్మవిశ్వాసంతో నీట్ పరీక్ష రాసి మంచి ర్యాంకు సాధించింది. అయితే ఆ తర్వాత కూడా హారికకు కష్టాలు ఎదురయ్యాయి. మెడికల్ కాలేజీలో చేరడానికి, పుస్తకాలకు, హాస్టల్ ఫీజుకు కలిపి మొత్తం రూ.2 లక్షలు అవసరమయ్యాయి. కానీ నిరుత్సాహపడకుండా తన ప్రతిభను గుర్తించి తన చదువులకు సాయం చేయమని దాతలను వేడుకున్నది. ఆమె అభ్యర్థనకు సామాజిక మాధ్యమాల్లో అనూహ్య స్పందన వచ్చింది. ఎంతోమంది దాతలు ఆమె చదువుకు అయ్యే ఖర్చును భరించడానికి ముందుకు వచ్చారు.
నేటి యువతకు ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ నిత్యవసరంలా మారిపోయాయి.కొంతమంది హారిక వలె ఇంటర్నెట్ను మంచి పనుల కోసం, లక్ష్య సాధన కోసం ఉపయోగించుకుంటుంటే, మరికొందరు మాత్రం తమ విలువైన సమయాన్ని, వనరులను కాలక్షేపం పేరిట వృథా చేసుకుంటున్నారు. సోషల్ మీడియా మాయలో పడి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాతో ఎన్ని లాభాలున్నాయో, అన్ని నష్టాలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా యువత గ్రహించాలి. ఇంటర్నెట్ను జ్ఞాన సముపార్జన కోసం వినియోగించాలి. పాఠ్య పుస్తకాల్లో దొరకని సమాచారాన్ని ఇంటర్నెట్లో శోధించాలి. ఇందుకు హారిక చక్కని ఉదాహరణ.
ఆశయ సాధనకు పేదరికం అడ్డుకాదని హారిక నిరూపించింది. సంకల్పాన్ని ఏకలవ్యుడి బాణంలా ఎక్కుపెట్టి లక్ష్య సాధనే ఊపిరిగా తాను అనుకున్న గమ్యాన్ని చేరడానికి ముందుకుపయనిస్తున్న హారిక జీవితం యువతకు ఆద ర్శం. సాధించాలనే తపన ఉంటే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యమే అనడంలో సందేహమే లేదు. అసాధ్యం అనే పదంలో ‘అ’ అక్షరాన్ని పక్కనేపెడితే మనిషి తన జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ప్రతి విద్యార్థికి క్రమశిక్షణ, దృఢసంకల్పం ఉండి, దానికి నిరంతర సాధన తోడైతే విజయం సాధించడం తథ్యం. అందుకే యువత, విద్యార్థులు అవరోధాలను అవకాశాలుగా మార్చుకోవాలి. అడ్డంకులను, సవాళ్లను అధిగమించడానికి కొత్త ఉపాయాలు ఆలోచించాలి. ఉన్న వనరులతో ఉన్నతమైన ఫలితాలను సాధించాలి.
కోట దామోదర్ , 93914 80475
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో గుండెపోటుతో ఎన్నికల అధికారిణి దుర్మరణం..!
‘ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు మేలు’
Vaikuntha Ekadashi | డిసెంబర్ 20 నుంచి తిరుమలలో ‘ వైకుంఠ ఏకాదశి ’ ద్వార దర్శనాలు
Gangula Kamalakar | కేసీఆర్ బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడితే.. రేవంత్ రెడ్డి చీకటి జీవో జారీ చేసిండు : ఎమ్మెల్యే గంగుల కమలాకర్
‘మైనార్టీ మహిళలకు ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగ అవకాశాలు’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

