AP News | ఏపీలో గుండెపోటుతో ఎన్నికల అధికారిణి దుర్మరణం..!
AP News | అనంతపురం జిల్లా కూడేరు మండలం కడదరకుంటలో విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఓ అధికారిణి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఏపీవోగా విధులు నిర్వహిస్తున్న హరిత గౌడ్‌కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన సహచర సిబ్బంది, పోలీసులు ఆమెను కూడేరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు.
AP News : అనంతపురం జిల్లా కూడేరు మండలం కడదరకుంటలో విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఓ అధికారిణి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఏపీవోగా విధులు నిర్వహిస్తున్న హరిత గౌడ్‌కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన సహచర సిబ్బంది, పోలీసులు ఆమెను కూడేరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. హరిత గౌడ్ రాయదుర్గంలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు.
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం పిట్లంపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రం 3లో గందరగోళం చోటుచేసుకుంది. దాంతో అధికారులు సుమారు గంటసేపు పోలింగ్‌ను నిలిపివేశారు. ఓటువేసే సమయంలో టీడీపీ, వైసీపీ వర్గీయులు ఒకేసారి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఎన్నికల సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.
అనంతరం అధికారులు వారిని బయటకు పంపి పోలింగ్ కేంద్రానికి తాళం వేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు విషయాన్ని ఆరా తీసి ఇరువర్గాల వారితో మాట్లాడారు. మరోసారి ఇరువర్గాల వారు పోలింగ్ కేంద్రంలోకి దూసుకురాగా, రూరల్ సీఐ గంగాధర సిబ్బందితో కలిసి వారిని చెదరగొట్టారు. కేవలం ఓటువేసేవారిని క్యూలో నిలుచోబెట్టి మళ్లీ పోలింగ్ ప్రారంభించారు.
మరోవైపు నెల్లూరు జిల్లా అనంతసాగరం ప్రభుత్వ పాఠశాల వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ అభ్యర్థులు పోలింగ్ కేంద్రంలో ఉన్నారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. దీనిపై వైసీపీ నాయకులు స్పందిస్తూ.. మీ పార్టీ వాళ్లు ఎందుకున్నారని ఎదురు ప్రశ్నించారు. ఈ క్రమంలో మంత్రి ఆనం, వైసీపీ మాజీ ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు కలగజేసుకొని వారిని చెదరగొట్టారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో గుండెపోటుతో ఎన్నికల అధికారిణి దుర్మరణం..!
‘ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు మేలు’
Vaikuntha Ekadashi | డిసెంబర్ 20 నుంచి తిరుమలలో ‘ వైకుంఠ ఏకాదశి ’ ద్వార దర్శనాలు
Gangula Kamalakar | కేసీఆర్ బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడితే.. రేవంత్ రెడ్డి చీకటి జీవో జారీ చేసిండు : ఎమ్మెల్యే గంగుల కమలాకర్
‘మైనార్టీ మహిళలకు ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగ అవకాశాలు’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

