Congress | ప్రశ్నిస్తాం నిలదీస్తాం.. సాధిస్తాం!
అలవిగాని హామీలు ఇచ్చి, ఆరు గ్యారెంటీలంటూ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆరు గ్యారెంటీలే కాకుండా దాదాపు 420 హామీలు ఇచ్చింది ఆ పార్టీ. వాటిలో ప్రధానపాత్ర పోషించింది మాత్రం యూత్ డిక్లరేషనే. హైదరాబాద్ వేదికగా ప్రియాంకాగాంధీ యూత్ డిక్లరేషన్ పేరిట మోసానికి తెరలేపారు.
Congress | అలవిగాని హామీలు ఇచ్చి, ఆరు గ్యారెంటీలంటూ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆరు గ్యారెంటీలే కాకుండా దాదాపు 420 హామీలు ఇచ్చింది ఆ పార్టీ. వాటిలో ప్రధానపాత్ర పోషించింది మాత్రం యూత్ డిక్లరేషనే. హైదరాబాద్ వేదికగా ప్రియాంకాగాంధీ యూత్ డిక్లరేషన్ పేరిట మోసానికి తెరలేపారు.
తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ దగాపడ్డదని, కాంగ్రెస్ ఉద్యోగాలు కల్పిస్తుందని చెప్తూ అరచేతిలో స్వర్గం చూపించారు ప్రియాంక. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమ బతుకులు బాగుపడతాయని భావించిన యువతను కాంగ్రెస్ నిండా ముంచింది.
కేసీఆర్ హయాంలో ఉద్యోగ కల్పనే జరగలేదన్నట్టుగా సోషల్‌మీడియా ద్వారా ఆ పార్టీ ప్రచారం చేయించింది. దీన్ని గుడ్డిగా నమ్మిన యువతీయువకులు బీఆర్ఎస్కు దూరమయ్యారు. కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. తొమ్మిదిన్నరేండ్ల ఏలుబడిలో 1.63 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారు కేసీఆర్. దేశంలోని ఇతర ఏ రాష్ట్రం కూడా ఈ విషయంలో తెలంగాణ దరిదాపుల్లో లేదు. కానీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సర్కార్ దీన్ని ప్రచారం చేసుకోలేదు. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది.
రెండు నెలలైనా యూత్ డిక్లరేషన్‌పై రేవంత్‌రెడ్డి సర్కార్ ఎటువంటి కార్యాచరణ రూపొందించలేదు. నెలకు రూ.4,500 నిరుద్యోగ భృతి ఇస్తామని గప్పాలు కొట్టి.. నేడు చేతులు ఎత్తేసింది. ‘నిరుద్యోగ భృతి ఇస్తామని మేం చెప్పలేదు’ అంటూ అసెంబ్లీ సాక్షిగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాటమార్చారు. అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేమని పేర్కొంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ నైజాన్ని బయటపెట్టారు. ఫిబ్రవరి 1న విడుదల చేస్తామన్న జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తడం లేదు పాలకులు.
ఉద్యోగ కల్పన గురించి పెదవి విప్పని రేవంత్‌రెడ్డి.. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన కొలువులను తాను కల్పించినట్టుగా చెప్పుకోవడం గమనార్హం. స్టాఫ్ నర్సింగ్, సింగరేణి తదితర ఉద్యోగాలను కేసీఆర్ సర్కారే భర్తీ చేసింది. కానీ, ఆ ఉద్యోగాల నియామక పత్రాలు అందజేస్తూ, సంబంధిత క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలని రేవంత్‌రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు.
కేసీఆర్‌పై నిందలేస్తూ ఉద్యోగాలను భర్తీ చేయకుండా తప్పించుకోవాలని రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. చైతన్యం కలిగిన తెలంగాణ యువత ఈ విషయాన్ని ఎప్పుడో పసిగట్టింది. ఉద్యోగాలు భర్తీ చేసే వరకు యువతీయువకులు ప్రశ్నిస్తూనే ఉంటారు, నిలదీస్తూనే ఉంటారు.
– జి.రాజేష్ నాయక్
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

