కాపాడినమంటూ అమ్మేస్తారా?
ఎవరికైనా పూర్వాశ్రమ వాసనలు అంత తొందరగా పోవు. ఇంగువ కట్టిన గుడ్డలా అవి అంటుకునే ఉంటాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాను రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చానని పదేపదే చెప్తుంటారు. వ్యక్తిగత స్థాయిలో ఎవరు ఏ వ్యాపారమైనా చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఒక రాష్ట్ర అధినేతగా ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లా చూడటం ఏమాత్రం మంచిది కాదు. ఇటీవల మియాపూర్‌లోని సుమారు 550 ఎకరాలకు పైగా గల భూమి సర్కార్‌దేనని సుదీర్ఘ వ్యాజ్యం తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయించడం ముదావహం.
ఎవరికైనా పూర్వాశ్రమ వాసనలు అంత తొందరగా పోవు. ఇంగువ కట్టిన గుడ్డలా అవి అంటుకునే ఉంటాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాను రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చానని పదేపదే చెప్తుంటారు. వ్యక్తిగత స్థాయిలో ఎవరు ఏ వ్యాపారమైనా చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఒక రాష్ట్ర అధినేతగా ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లా చూడటం ఏమాత్రం మంచిది కాదు. ఇటీవల మియాపూర్‌లోని సుమారు 550 ఎకరాలకు పైగా గల భూమి సర్కార్‌దేనని సుదీర్ఘ వ్యాజ్యం తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయించడం ముదావహం. ఇదే సమయంలో ఖాజాగూడలో దాదాపు రూ.680 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఓ కంపెనీ హస్తగతం చేసుకున్నది.
ఇందుకు పెద్దల అండ ఉన్నదని తెలుస్తున్నది. ప్రభుత్వ భూముల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు, ప్రజా ఆస్తుల పునరుద్ధరణ వంటి అంశాలు పాలకుల ప్రాధాన్యాల్లో మొదటి వరుసలో ఉండాలి. భవిష్యత్తు తరాల అవసరాలకు ఉపయోగపడే ప్రభుత్వ భూములను కాపాడటం ఏ ప్రభుత్వమైనా తన ప్రాథమిక బాధ్యతగా భావించాలి. కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నామంటూ ఓ వైపు గొప్పలు చెప్పుకోవడం, అదే సమయంలో వాటిని విక్రయించి ఆదాయం సమకూర్చుకోవాలని ప్రణాళికలు రచించడం రెండు నాల్కల ధోరణికి అద్దం పడుతున్నది. భూములను స్వాధీనం చేసుకున్నామన్న ప్రచారానికి, వాటిని విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని ప్రభుత్వం ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది.
మియాపూర్ భూమి గత ప్రభుత్వ న్యాయపోరాట ఫలితంగా విముక్తమైతే ఆ పార్టీపైనే అడ్డగోలుగా ఆరోపణలు చేయడం దిగజారుడు రాజకీయం. కోర్టు తీర్పు వెలువడిన సందర్భంగా సీఎం చేసిన వ్యాఖ్యలు ఆయనకు నరనరానా పాకిన కక్ష రాజకీయాల జాఢ్యానికి నిదర్శనం. పిడుక్కీ, బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్టుగా సదరు భూముల వ్యవహారాన్ని బీఆర్ఎస్తో ముడిపెట్టాలని చూడటం అర్థరహితం. ఈ తరహా వదరుబోతుతనాన్ని ప్రజలు గమనిస్తున్నారనే సోయి సీఎంకు లేకపోవడం దురదృష్టకరం. సివిల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా బీఆర్ఎస్ సర్కార్ జరిపిన ఎడతెగని న్యాయపోరాటం తెలిసిందే. ఇప్పుడా ఘనతను తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ చూడటం చవకబారు ఎత్తుగడ మాత్రమే. నిరర్థక ప్రేలాపనలతో దృష్టి మళ్లించి కాపాడానంటున్న భూములనే అమ్మకానికి పెట్టాలని చూడటం అసలు కుట్ర. ఈ సందర్భంగా మనకు రెండు అంశాలు స్పష్టమవుతున్నాయి. ఒకటి ప్రభుత్వ నిర్వహణ చేతకాక, ఆదాయం పెంచుకోలేక సీఎం చతికిలపడటం. గతంలోనూ ప్రభుత్వాలు భూములు అమ్మకానికి పెట్టిన ఉదంతాలు లేకపోలేదు. అయితే కేవలం ఆ ఆదాయం మీదే పరిపాలన నడపాలని అనుకోవడం ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేకతగా చెప్పుకోవాలి.
ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడం ఒక అంశమైతే, వాటిని విక్రయించడం పూర్తిగా భిన్నమైన అంశం. ఆక్రమణదారుల నుంచి భూములను విడిపించి ప్రజా ప్రయోజనాలకు వినియోగిస్తామని చెప్పడం ఒకటి. ఆ భూములను వేలం వేసి ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు అప్పగించడం మరొకటి. ఈ రెండింటినీ ఒకే గాటన కట్టడం కుదరదు. కోర్టు తీర్పు వెలువడిన 24 గంటల్లోనే భూమిని అమ్మానికి పెట్టే సర్కార్ భూములను కాపాడే సర్కార్ అవుతుందా అనేది ప్రశ్న.
ప్రభుత్వ భూములు పాలకపక్షానికి చెందిన వ్యక్తుల ఆస్తులు కావు. అవి ప్రజల ఉమ్మడి సంపద. వాటిని కాపాడి, ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి వేగంగా విస్తరిస్తున్న నగరంలో ప్రభుత్వ భూములకు అపారమైన ప్రాధాన్యం ఉన్నది. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు, దవాఖానలు, పార్కులు, ప్రజా రవాణా సదుపాయాలు, నీటి వనరులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ భూములే కీలకంగా మారతాయి. నగర విస్తరణతో భూముల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడున్న ప్రభుత్వ భూములను అమ్మేస్తే, భవిష్యత్తులో ప్రజా అవసరాల కోసం అదే భూమిని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం భారీ మొత్తాలను వెచ్చించాల్సి రావచ్చు.
నేడు తాత్కాలిక ఆదాయం కోసం తీసుకునే నిర్ణయం రేపు ప్రజాధనంపై అదనపు భారంగా పరిణమించవచ్చు. ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నామని చెప్పుకోవడం కంటే వాటిని ఎలా పరిరక్షిస్తున్నారన్నదే అసలైన కొలమానం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు, రాష్ట్ర అభివృద్ధిపై చేసిన ప్రకటనలు ప్రజలకు గుర్తున్నాయి. వాటి అమలుకు రోడ్డు మీదకు వచ్చి డిమాండ్ చేస్తున్నారు. ఆ హామీల అమలుకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం ప్రభుత్వ బాధ్యతే. కానీ ఆర్థిక నిర్వహణలోని లోపాలను పూడ్చుకోవడానికి ప్రజల ఉమ్మడి ఆస్తులను విక్రయించడం సులభమైన పరిష్కారంగా భావిస్తే అది రాష్ట్ర భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందని చెప్పక తప్పదు.
Read Today's Latest Editorial News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

