హక్కుల యోధురాలికి నోబెల్
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి దక్షిణాఫ్రికా హక్కుల పోరాటయోధురాలు నవీ పిైళ్లెని ఎంపిక చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా హర్షామోదాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె దక్షిణాఫ్రికాకు చెందిన భారత సంతతి తమిళ మూలాలున్న వ్యక్తి కావడం మనకు గర్వకారణం. న్యాయవాదిగా పలు జాతీయ, అంతర్జాతీయ కేసుల్లో వాదిం చారు. నెల్సన్ మండేలా సహా అనేకమంది దక్షిణాఫ్రికా విముక్తి పోరాటయోధుల తరఫున బలమైన వాదనలు వినిపించిన న్యాయవాదిగా ఆమెకు పేరున్నది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి దక్షిణాఫ్రికా హక్కుల పోరాటయోధురాలు నవీ పిైళ్లెని ఎంపిక చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా హర్షామోదాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె దక్షిణాఫ్రికాకు చెందిన భారత సంతతి తమిళ మూలాలున్న వ్యక్తి కావడం మనకు గర్వకారణం. న్యాయవాదిగా పలు జాతీయ, అంతర్జాతీయ కేసుల్లో వాదిం చారు. నెల్సన్ మండేలా సహా అనేకమంది దక్షిణాఫ్రికా విముక్తి పోరాటయోధుల తరఫున బలమైన వాదనలు వినిపించిన న్యాయవాదిగా ఆమెకు పేరున్నది.
ఆ తర్వాత సుదీర్ఘకాలం అంతర్జాతీయ మానవహక్కుల కోసం కృషి చేశారు. అంతర్జాతీయ శాంతి, న్యాయసూత్రాల బలోపేతానికి చేసిన కృషికి గుర్తింపుగానే ఆమెను శాంతి బహుమతికి ఎంపిక చేశారు. రువాండాపై ఏర్పాటైన అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్ జడ్జిగా నవీ పిైళ్లె స్త్రీలపై జరిగే అత్యాచారాలను నరమేధంతో సమానమైన నేరంగా పరిగణనకు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం (ఐసీసీ), అంతర్జాతీయ వివాదాల న్యాయస్థానం (ఐసీజే) న్యాయమూర్తిగానూ ఆమె పనిచేశారు. ఇటీవలి కాలంలో ఆక్రమిత పాలస్తీనా భూభాగాలపై ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ కమిషన్ చైర్‌పర్సన్‌గా కూడా వ్యవహరించారు. ఈ జీవితకాల కృషికి గుర్తింపుగా 85 ఏండ్ల నవీని నోబెల్ బహుమతికి ఎంపిక చేయడం, ఎంపిక కమిటీ తీసుకున్న అనేక తప్పుడు నిర్ణయాల పరంపర మధ్య జరిగిన సముచిత నిర్ణయంగా భావించాలి. తనకు లభించిన నోబెల్ పురస్కారాన్ని అంతర్జాతీయ నేరాలను తట్టుకుని నిలిచిన బాధితులకు అంకి తం చేయడం ఆమె ఔన్నత్యానికి నిదర్శనం.
ఓ వైపు నవీ ఎంపికపై ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదని చిందులు తొక్కుతున్నారు. ఆయన నిర్హేతుక, దుందుడుకు వ్యవహార శైలి తెలిసినవారికి ఇదేమంత ఆశ్చర్యం కలిగించదు. 8 యుద్ధాలు ఆపానని, కనుక తనకే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలనేది ఆయన వాదన. ట్రంప్ చెప్పుకుంటున్న జాబితాలో భారత్-పాక్ యుద్ధం కూడా ఉండటం తెలిసిందే. మరోవైపు ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై యుద్ధం చేస్తూనే తనకు నోబెల్ ఇవ్వాలని వాదించడం ఆయనకే చెల్లింది. నవీ ఒకప్పుడు న్యాయమూర్తిగా పనిచేసిన అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానంపై ట్రంప్ ఆంక్షలు విధించారు. నోబెల్ బహుమతికి నవీని ఎంపిక చేయడంపై ట్రంప్ సోషల్ మీడియాలో అక్కసు వెళ్లగక్కారు. ఆమె అమెరికా వ్యతిరేకురాలని దుయ్యబట్టారు. ఇక ట్రంప్‌కు అవార్డు ఇవ్వాలని పాక్ ప్రధాని సిఫారసు చేయడం మరో విడ్డూరం.
ఏదేమైనా నోబెల్ కమిటీ వ్యవహార శైలి ఎల్లవేళలా విమర్శలకు అతీతంగా లేదనేది తెలిసిందే. 1901లో అవార్డు ఏర్పాటైనప్పటి నుంచీ వివాదాలు ముసురుకుంటూనే ఉన్నాయి. పోయినేడాది ట్రంప్ అభిమాని అయిన వెనుజువెలా ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడోకు శాంతి బహుమతి ఇవ్వడంపై చాలా విమర్శలు వచ్చాయి. అది అమెరికాకు బుజ్జగింపు తప్ప, మరోటి కాదని అభిప్రాయం వినిపించింది. వెనుజువెలాపై అమెరికా దాడికి దాదాపు మూణ్నెళ్లు ముందుగా ఈ అవార్డు ఇవ్వడం తెలిసిందే. మచాడో నోబెల్ అవార్డు అందుకున్న తర్వాత నేరుగా వెళ్లి దానిని ట్రంప్ మెడలో వేయడం ఇంకా విచిత్రం. ఇప్పుడు అవార్డు అందుకున్న తర్వాత నవీ ఓ సమావేశంలో మాట్లాడుతూ ‘చప్పట్లు మరీ గట్టిగా కొడితే.. నేను ఈ అవార్డును ట్రంప్‌తో పంచుకోవాల్సి వస్తుంది’ అని వ్యం గ్యంగా చురకలు వేయడం కొసమెరుపు. అయి తే నోబెల్ కమిటీ గతంలోనూ అనేకరకాలుగా విమర్శల పాలైంది.
ముఖ్యంగా మహాత్మా గాంధీజీ సహా భారతీయుల్లో చాలా తక్కువమందిని ఈ అవార్డుకు ఎంపిక చేయడం ఒక రకమైన వివక్షే. అందునా గాంధీ పేరు 5 సార్లు నామినేట్ అయినప్పటికీ ఎంపిక చేయలేదు. ఇది పెద్ద తప్పిదమని నోబెల్ కమిటీ కూడా అంగీకరించింది. ఇది ఇవ్వకుండా చేసిన తప్పిదమైతే, ఇవ్వడం ద్వారా చేసిన తప్పిదాలు తక్కువేమీ కావు. అమెరికా యుద్ధోన్మాది హెన్రీ కిసింజర్‌కు, నరమేధం ఆరోపణలు ఎదుర్కొ న్న ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ వంటివారికి అవార్డు ఇవ్వడంపై వివాదాలు చెలరేగాయి. మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీకి ఇవ్వడంపైనా విమర్శలు వచ్చాయి. పాశ్చాత్య దేశాల భౌగోళిక విధానాలకు అనుగుణంగా ఎంపికలు జరుగుతాయనడానికి నిదర్శనాలు కోకొల్లలు. అయితే అమెరికా తప్పుడు విధానాలను నిలదీసిన నవీని ఈసారి బహుమతికి ఎంపిక చేయడం.. వాటన్నింటికీ మినహాయింపుగా నిలువడం విశేషం.
Read Today's Latest Editorial News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

