పల్లవి:
నిశీధిలో పరాగ్గ కూర్చొని
నిరాశ పడతావా
ఉషోదయానికి ఊపిరులూది
సలాము కొడదామా
తపస్సులోంచి వచ్చిన జన్మలో
ఉసూరుమంటావా
ఖర్మని సమాధి కడతావా
చీకటి చీల్చుకు వెలుతురు బాకుకు స్వాగతమందామా
సవాలు చేద్దామా
చరణం1:
ఎప్పటికప్పుడు
ఇప్పుడు కాదని
పక్కన పెడతావా
రేపటి తూరుపు
తలుపును తెరచి
రమ్మని అందామా
ఇపుడే రమ్మని అందామా
పల్లవి
చరణం2:
తప్పుల కుప్పలు
గొప్పగ చేస్తూ
సర్దుకుపోతావా
దారిని మలిచి
బతుకును దిద్ది
ముందుకు సాగేవా
దారిలో ముందుకు సాగేవా
పల్లవి
చరణం3:
జీవితమంటే
యుద్ధం అనుకొని
కత్తులు దూసేవా
బాధల శత్రువు
కుత్తుక కోసి
నెగ్గుకు వస్తావా
బతుకును నెగ్గుకు వస్తావా
పల్లవి
-దండమూడి శ్రీచరణ్
98661 88266