గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - Jul 13, 2020 , 23:38:14

ఒక కుట్ర - రెండు ద్రోహాలు

ఒక కుట్ర - రెండు ద్రోహాలు

బీజేపీ నాయకుల దృష్టిలో దేశభక్తి అంటే.. జెండా కప్పుకోవడం, బోలో భారత్‌ మాతాకీ జై అంటూ నినదించడం, ఇండియా పాకిస్థాన్‌ మ్యాచ్‌ వస్తే హంగా మా చేయడం, మతాల మధ్య చిచ్చుపెట్టడం. కానీ, కేసీఆర్‌ మదిలో దేశభక్తి అంటే.. ఈ మట్టిమీద ప్రేమ, ఇక్కడి మనుషుల పట్ల గౌరవం, రాజ్యాంగం అంటే భక్తి, ప్రజాస్వామ్యం మీద నమ్మకం.. మొత్తంగా కేసీఆర్‌ అంటే ఒక పరిణతి. అందుకే, కరోనా వైరస్‌ ఢిల్లీ కేంద్రంగా ఉన్న తబ్లిగీ జమాత్‌ నుంచే దేశం మొత్తం పాకిందని గుర్తించిన వెంటనే కేంద్రానికి సమాచారం అందించారు. ఇవే కాదు, జీఎస్టీ, డీమానిటైజేషన్‌, కరోనా లాక్‌డౌన్‌, ఆర్టికల్‌-370, పాకిస్థాన్‌తో యుద్ధ వాతావరణ సమయంలోనూ, ఇప్పుడు చైనాతో ఘర్షణ సమయంలోనూ జాతీయ ప్రయోజనాల కోసం కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయానికి సంపూర్ణంగా మద్దతు పలికిన బీజేపీయేతర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కరే

“రాజ్యం పట్ల మేధావులు అతిగా దిగులు పడితే..

ఆ రాజ్యం అభివృద్ధి చెందుతున్నట్టు లెక్క”

సోషల్‌ మీడియాలో విరివిగా వైరల్‌ అవుతున్న కొటేషన్‌ ఇది. పైమాట ఇప్పుడు తెలంగాణ పరిస్థితికి అద్దం పడుతున్నది. దేశంలోని మేధావుల చూపంత తెలంగాణ మీదనే ఎందుకున్నదో చెప్పకనే చెప్తున్నది. కరోనా కట్టడిలో తెలంగాణ ఎట్లున్నదో అంకెలతో సహా తర్వాత చర్చించుకుందాం. మొదలు ఈ మేధావుల చూపు తెలంగాణ మీద ఎందుకు పడ్డదో చర్చించాల్సిన అవసరం ఉంది. ‘ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌' పత్రిక ఏ మాత్రం ఆధారాలు సేకరించకుండా.. కేవలం సోషల్‌ మీడియా పోస్ట్‌ను ఆధారం చేసుకొని ‘Coro -na virus patient’s body carried to burial grou -nd in a JCB in Telangana’ అంటూ వార్త రాసి జర్నలిజం విలువల్ని అదే జేసీబీలో వేసి కాటికి పంపింది. ఇంకో పేరున్న జర్నలిస్ట్‌ తెలంగాణల టెస్టులు జరుగుతలెవ్వు, జరిగినా పాజిటివ్‌ రేట్‌ ఎక్కువుంది కాబట్టి.. ‘ఎన్డీఎంఏ’ని ఉపయోగించి కేంద్రం కరోనాను కట్టడి చేయాలంటూ గుప్త రహ స్యం చెప్తున్నడు. వీళ్లే కాదు.. తెలంగాణ ఆత్మగౌరవంతో సగర్వంగా నిలబడటం అంటే సుతారం ఇష్టం లేని కొన్ని బానిస స్లీపర్‌ సెల్స్‌.. నిత్యం అసత్యాలను, అర్ధ సత్యాలను పుంఖానుపుంఖాలుగా ప్రసారం చేస్తూ.. తెలంగాణను, కేసీఆర్‌ను పలుచన చేసే కార్యక్రమాలు చేస్తున్నాయి. దేశంలో ఎక్కడ ఏం జరిగినా కిక్కురుమనని ఈ జర్నలిస్టులు, మేధావులు తెలంగాణ విషయంలో మాత్రం ఎగిరెగిరిపడుతుంటారు. కారణం ఒక్కటే.. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కేసీఆర్‌ ఒక్కడే బలమైన నేత, పైగా వేలెత్తి చూపడానికి సరైన కార ణం దొరకని నేత.. రాజకీయ వ్యూహాలు అల్లడంలో దిట్ట. ఇలాంటి ఒక్క కేసీఆర్‌ను బలహీనం చేస్తే ఇక దక్షిణ భారతం ఆసాంతం తమ పాదాల దగ్గరే పడుంటుందనేది ఉత్తరాది మేధావుల ఆలోచన. అందుకే బిల్లిబిత్తరి విషయాలను కూడా జాతీయం చేయాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటరు. చిన్నచిన్న వార్తల్ని పెద్దగా రాసి బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తుంటరు. వాస్తవాలు లేని వార్తలు ఈ సోషల్‌ మీడియా కాలంలో నిలువవని వాళ్లకూ తెలుసు.. కానీ నిజం బయటపడేంతలో కొద్ది సమయమైనా రాక్షసానందం పొందుతుంటరు. అందుకే తెలంగాణ బిడ్డలంతా ఈ మిడతల దండుతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 

ఒక్క తెలంగాణలోనే కరోనా కేసులా..?

ఆ మేధావుల సంగతి అటుంచితే.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా బాధ్యతాయుతంగా ఉండాల్సిన ప్రతిపక్షాలు.. తెలంగాణలో శవాల మీద పేలాలు ఏరుకునే బిజీలో ఉన్నాయి. ఈ బీజేపీ, కాంగ్రెస్‌ నాయకుల వెకిలి ప్రవర్తన చూస్తుంటే ఇప్పుడే నీతి దోతికట్టుకున్నదనిపిస్తుంది. వాళ్లు పాలించే రాష్ర్టాల్లో ఎమర్జెన్సీకి ఎక్కువ-డెత్‌ గేమ్‌కి తక్కువన్నట్టు ఉంది పరిస్థితి. కానీ వారు మాత్రం ఒక్క తెలంగాణలోనే కరోనా కేసులు ఎక్కువున్నయి, కంట్రోల్‌ చేయడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారంటూ చెప్తుంటరు. అది పచ్చి అబద్ధం అనేందుకు అనేక ఉదాహరణలు మన కండ్ల్లముందు కనిపిస్తాయి. 2020 జూలై 12 నాటికి తెలంగాణ ప్రభుత్వం 1,70,324 టెస్టులను చేసింది. ఇందులో 1,35,653 నెగటివ్‌ కాగా, 34,671 పాజిటివ్‌. ఇందులో 20,919 మంది పూర్తి ఆరోగ్యంతో దవాఖానల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. 356 మంది చనిపోయారు. కానీ బీజేపీ పాలిత రాష్ర్టాలైన గుజరాత్‌లో 2045, యూపీలో 934, కర్ణాటకలో 684, (ఆదివారం ఒక్కరోజే 71 మంది కరోనాతో మృతిచెందారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు) మధ్యప్రదేశ్‌లో 653, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్‌లో 510, పశ్చిమబెంగాల్‌లో 932 మరణాలు సంభవించాయి.

ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కేసీఆర్‌ ఒక్కడే బలమైన నేత, పైగా వేలెత్తి చూపడానికి సరైన కారణం దొరకని నేత.. రాజకీయ వ్యూహాలు అల్లడంలో దిట్ట. ఇలాంటి ఒక్క కేసీఆర్‌ను బలహీనం చేస్తే ఇక దక్షిణ భారతం ఆసాంతం తమ పాదాల దగ్గరే పడుంటుందనేది ఉత్తరాది మేధావుల ఆలోచన. అందుకే బిల్లిబిత్తరి విషయాలను కూడా జాతీయం చేయాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటరు. చిన్నచిన్న వార్తల్ని పెద్దగా రాసి బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తుంటరు. వాస్తవాలు లేని వార్తలు ఈ సోషల్‌ మీడియా కాలంలో నిలువవని వాళ్లకూ తెలుసు.. కానీ నిజం బయటపడేంతలో కొద్ది సమయమైనా రాక్షసానందం పొందుతుంటరు. అందుకే తెలంగాణ బిడ్డలంతా ఈ మిడతల దండుతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ జూలై 6న విడుదల చేసిన టాప్‌- 5 మోస్ట్‌ కరోనా కేసుల రాష్ర్టాల జాబితాలోనూ తెలంగాణ రాష్ట్రం లేదు. నిజం చెప్పాలంటే.. సిమ్టమ్స్‌ ఐడెంటిఫికేషన్‌ నుంచి మొదలుకుంటే పరీక్షలు, హోం క్వారంటైన్‌, ట్రీట్మెంట్‌, డిశ్చార్జ్‌ వరకు ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌ను పాటిస్తున్నప్పటికీ.. రికవరీ కాకుండానే డిశ్చార్జ్‌ చేస్తున్నరని సర్కారుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నరు. అత్యధిక ఎయిర్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ కలిగిన టాప్‌ 5 స్టేట్స్‌లో తెలంగాణ ఒకటి. అంతేకాదు, దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన ప్రజలు నివసించే మినీ భారత్‌ హైదరాబాద్‌. క్రైం రేట్‌ లేకపోవడం.. ట్రాన్స్‌పోర్టేషన్‌లో దేశానికి మిడిల్‌ పాయింట్‌గా ఉండటం, సౌకర్యవంతమైన, సౌలభ్యమైన జీవన స్థితిగతులు కలిగి ఉండటం, ఐటీ, ఫార్మా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, స్టార్టప్‌లకు హబ్‌గా ఉన్న పరిస్థితుల్లో మిగతా రాష్ర్టాలలాగే ఇక్కడ కూడా లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత కరోనా కొంత ఎక్కువగా ఉండటంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అయినా ఇవేవీ పట్టనట్టు బీజేపీ నాయకులు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం గర్హనీయం.

ఈ దేశంలో అత్యధిక మరణాల రేటు 5.39 శాతంతో గుజరాత్‌ దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. అక్కడ ఇప్పటికే 41,820 కేసులు నమోదైనయి. స్వయంగా ఆ రాష్ట్రం నుంచే దేశానికి ప్రధానిగా మోదీ ఉన్నప్పటికి చెప్పుకోలేని దయనీయమైన పరిస్థితి ఉంది. ఇక కేంద్రం ఆధీనంలో ఉన్న ఢిల్లీలో కేసుల సంఖ్య లక్ష దాటిపోయింది, ఇంకా పెరుగుతూనే ఉంది. అక్కడ నిత్యం కర్ఫ్యూను తలపిస్తున్నట్టుంది. కర్ణాటకలో పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో చెప్పాల్సిన పనిలేదు. బెంగళూరు నగరం నుంచి నిత్యం వేల మంది తమ సొంతూళ్లకు పోతున్న వైనం మనం టీవీల్లో చూస్తున్నదే. టోల్‌ప్లాజాల దగ్గర కిలోమీటర్ల లైన్లు పత్రికల్లో పతాక శీర్షికల్లో ఎక్కుతున్నదే. బీహార్‌లోనూ పరిస్థితి అలాగే ఉంది. బీజేపీ,  దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టా ల్లో పరిస్థితులు ఇలా ఉంటే ఒక్క జర్నలిస్టుకూ కనిపించదు, ఈ విషయాలేవి ఆ మేధావుల దృష్టికి రావు, బీజేపీ పాలిత రాష్ర్టాల సమస్యలు, వైఫల్యాల గురించి మాట్లాడటానికి వీళ్లకసలు నోరే లేవదు. అదే తెలంగాణలో చీమ చిటుక్కుమన్నా మిన్ను విరిగి మీద పడినట్టు హాహాకారాలు చేస్తరు, ఆగమాగం చేస్తరు. వీళ్ల తప్పుడు కథనాలను ఆధారం చేసుకొని.. ఇక్కడి నేతలు కూడా తెలంగాణపై, కేసీఆర్‌ ప్రభుత్వంపై నిత్యం విషం చిమ్ముతుంటరు. వీళ్లు చాలదన్నట్టు ఓ కేంద్రమంత్రి కూడా హైదరాబాద్‌లో కరోనా చేయిదాటిపోయిందని స్టేట్మెంట్లు ఇస్తున్నడు. తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు శ్రమించి ఇంపోర్ట్‌ చేసుకున్న కరోనా టెస్టింగ్‌ మిషన్‌ను.. కేంద్రం పశ్చిమబెంగాల్‌కు మళ్లిస్తే కిమ్మనకుండా చేతులు ముడుచుకొని కూర్చున్న ఈ అసమర్థ నాయకులు.. సిగ్గువిడిచి తెలంగాణలో కేసులు పెరుగుతున్నయని ప్రచా రం చేస్తున్నారు. ఇక జీవితంలో కనీసం కార్పొరేటర్‌గా కూడా గెలవని పక్క రాష్ర్టానికి చెందిన ఓ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ గడ్డ మీదికొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నడు. అంటే తెలంగాణల బీజేపీ నేతలకు ఆ స్థాయిలేదా.. తెలంగాణ వచ్చినా ఇంకా వీరి బానిస డీఎన్‌ఏ చావలేదా..? తెలంగాణ బీజేపీ నాయకులే తేల్చుకోవల్సిన అవసరం ఉంది.

అధికారం కోసం అడ్డదారులేలా..?

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్‌ సొంత ప్రజలను ఇబ్బందికి గురిచేసే ఏ నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ బిడ్డలకు నష్టం జరుగుతుందనుకుంటే రాజకీయ ప్రయోజనం ఉన్నా ఆ దారికి పోలేదు. లేదంటే లోభాలు, ప్రలోభాల్లో అందెవేసిన సీమాంధ్రుల చక్రబంధనాల నుంచి తెలంగాణ తెచ్చేవారా..? అంత నిజాయితీగా ఉద్యమం చేశారు, అంతే ప్రేమతో పాలిస్తున్నరు కాబట్టే ఇవ్వాళ రాష్ట్రం అభివృద్ధిలో పురోగమిస్తున్నది. పేదల ఇంటికి సురక్షితమైన తాగునీరు అందుతున్నది. పొలం గట్టు పక్కనుంచే నిత్యం గంగమ్మ పరుగులు పెడుతున్నది. టూ ఫేజులు, త్రీ ఫేజులు మాయమైనయి, మోటర్లు కాలిపోవుడు ఆగిపోయినయి. చెరువుల్లో చేపలతో ముదిరాజులు, బెస్తలకు ఉపాధి పెరిగింది. ఆగకుండా అందుతున్న కరెంటుతో ఎవుసాలు, పరిశ్రమలు చక్కగా నడుస్తున్నయి, ఊళ్లో పండిన పంటలు ఊళ్లోనే కాంటా అయితున్నయి. పల్లెలన్నీ ఉపాధి కేంద్రాలుగా మారినయి. ఇవేకాదు.. కరోనా దెబ్బకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులైనా.. రైతుబంధు అందించిన అసాధారణ రైతు సంక్షేమ పిపాసి కేసీఆర్‌. ఒకవైపు లాక్‌డౌన్‌ నడుస్తున్నా.. హైదరాబాద్‌ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించి రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, నగర సుందరీకరణ, సౌకర్యాల కల్పనను నిరంతరంగా కొనసాగించిన అభివృద్ధి కాముకుడు. ఇంతటి మార్పును తెచ్చిన కేసీఆర్‌ను పలుచన చేయాలనే కుటిలబుద్ధితో ప్రతిపక్ష నాయకులు నికృష్టమైన రాజకీయాలు చేస్తున్నారు. కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే హరితహారం ఎం దుకంటున్నరు.. ప్రాజెక్టుల పనులెందుకు, సెక్రటేరియట్‌ కూలగొట్టుడెందుకని పసలేని ఆరోపణలు గుప్పిస్తున్నరు. కరోనా వచ్చిందని ఇంట్లో కూర్చోడానికి ప్రభుత్వం ఒక వ్యక్తికాదు.. నాలుగున్నర కోట్ల ప్రజలకు సంక్షేమం, సమస్యలకు జవాబుగా నిలవాల్సిన వ్యవస్థ. రాజ్యాంగం మీద, ప్రభుత్వ బాధ్యతలపైన కనీస అవగాహన లేని సంకుచిత రాజకీయ నాయకుల నుంచి ఇంతకు మించి ఏం ఆశించగలం. 

ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కేసీఆర్‌ ఒక్కడే బలమైన నేత, పైగా వేలెత్తి చూపడానికి సరైన కారణం దొరకని నేత.. రాజకీయ వ్యూహాలు అల్లడంలో దిట్ట. ఇలాంటి ఒక్క కేసీఆర్‌ను బలహీనం చేస్తే ఇక దక్షిణ భారతం ఆసాంతం తమ పాదాల దగ్గరే పడుంటుందనేది ఉత్తరాది మేధావుల ఆలోచన. అందుకే బిల్లిబిత్తరి విషయాలను కూడా జాతీయం చేయాలని తీవ్రంగాప్రయత్నం చేస్తుంటరు. చిన్నచిన్న వార్తల్ని పెద్దగా రాసి బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తుంటరు. వాస్తవాలు లేని వార్తలు ఈ సోషల్‌ మీడియా కాలంలో నిలువవని వాళ్లకూ తెలుసు.. కానీ నిజం బయటపడేంతలో కొద్ది సమయమైనా రాక్షసానందం పొందుతుంటరు. అందుకే తెలంగాణ బిడ్డలంతా ఈ మిడతల దండుతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రపంచం ముందు సగర్వంగా నిలబడిన హైదరాబాద్‌ కీర్తికిరీటం చేజారిపోవాలి.. ఉపాధి కోసం ఇది మా హైదరాబాద్‌ అనే నమ్మకంతో వచ్చిన తెలంగాణ బిడ్డల నమ్మకం సన్నగిల్లాలి.. ఇదే బీజేపీ నాయకుల దుర్మార్గమైన ఆలోచన. కానీ కౌరవుల్లాంటి నాటి సమైక్య శిఖండుల రాజకీయ పద్మవ్యూహాన్ని బద్దలుకొట్టిన చైతన్యం తెలంగాణ బిడ్డలది. తెలంగాణకు నీతికి గొడుగు పట్టడం తెలుసు.. అన్యాయానికి, అధర్మానికి ఎదురునిలవడం తెలుసు అన్న సంగతిని బీజేపీ నాయకులు ఎరిగి మసులుకుంటే మంచిది.

ఇక కులమతాల గొడవల్లేని తెలంగాణలో మతం రంగు పులమాలని చూసిన బీజేపీ నాయకులే.. పొట్టకూటి కోసం పట్నం వచ్చి బతుకుతున్న పేదోళ్లను కరోనా పేరుతో భయభ్రాంతులకు గురిచేసి తిరిగి ఊళ్లకు పంపే కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నరు. దీనివల్ల పరిశ్రమల్లో మానవ వనరులు తగ్గి, పరిశ్రమలు మూతపడతాయి, ఊర్లోకి పోయిన జనానికి ఉపాధిలేక బతుకులు ఛిద్రమవుతాయి. ఈ రెండు జరిగితే జనం కేసీఆర్‌కు వ్యతిరేకమైతరనీ, అప్పుడు మాకు అధికారం ఈజీ అవుతుందనే దుర్మార్గమైన రాజకీయాలకు పాల్పడుతున్నరు. బీజేపీ నాయకుల వ్యవహారం చూస్తుంటే ఇటాలియన్‌ రాజకీయ తత్త్వవేత్త నికోలాస్‌ మ్యాకియవెల్లి చెప్పిన ‘Politi -cs have no relation to moral’ అనే మాట నిజం అనిపిస్తుంది.

కర్ణాటకలో కూల్చివేత, మధ్యప్రదేశ్‌లో పూడ్చివేత, మహారాష్ట్రలో మిత్రద్రోహం, గోవాలో ఘోరం, మణిపూర్‌ మాయాజాలం గురించి చెప్పుకొంటూపోతే తడిగుడ్డతో రాజ్యాంగం గొంతుకోసిన బీజేపీ, అదే కోవలో పచ్చగున్న తెలంగాణలో చిచ్చుబెట్టి.. చితిమంటల్లో చలిమంటలు కాచుకోవాలని చూస్తున్నది. అందుకే తెలంగాణ ప్రజలను వాళ్లకే తెలియని సమస్యలు వేధిస్తున్నట్టూ, స్వర్గానికి నిచ్చెన బీజేపీ యేనని, ఈ దేశానికి బాడీగార్డ్‌ కాషాయదళమేనని అబద్ధాలను, భ్రమలను ప్రజల్లో నాటే ప్రయత్నం చేస్తున్నారు. దక్షిణ భారతదేశం నుంచి ఉన్న బలమైన నేత కేసీఆర్‌ను బదనాం చేయడం, అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తూ.. బీజేపీ పాలిత రాష్ర్టాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న వైబ్రెంట్‌ హైదరాబాద్‌ బ్రాండ్‌ను దెబ్బతీయడం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పోటీనైనా ఇయ్యాలనే దుర్మార్గమైన ఆలోచనతో బీజేపీ అమాయక జనంలో లేని భయాందోళనలు రేకెత్తిస్తున్నది. ఈ కుట్ర వల్ల ప్రపంచం ముందు సగర్వంగా నిలబడిన హైదరాబాద్‌ కీర్తికిరీటం చేజారిపోవాలి.. ఉపాధి కోసం ఇది మా హైదరాబాద్‌ అనే నమ్మకంతో వచ్చిన తెలంగాణ బిడ్డల నమ్మకం సన్నగిల్లాలి.. ఇదే బీజేపీ నాయకుల దుర్మార్గమైన ఆలోచన. కానీ కౌరవుల్లాంటి నాటి సమైక్య శిఖండుల రాజకీయ పద్మవ్యూహాన్ని బద్దలుకొట్టిన చైతన్యం తెలంగాణ బిడ్డలది. తెలంగాణకు నీతికి గొడుగు పట్టడం తెలుసు.. అన్యాయానికి, అధర్మానికి ఎదురునిలవడం తెలుసు అన్న సంగతిని బీజేపీ నాయకులు ఎరిగి మసులుకుంటే మంచిది. పార్లమెంట్‌ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచినమని తొడగొట్టి తొండి రాజకీయాలు చేస్తే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు రిపీట్‌ అవుతుంది. వారి గురివిందనీతి రాజకీయాలకు వారే బలికాక తప్పదు.
logo