బుధవారం 08 ఏప్రిల్ 2020
Editorial - Feb 21, 2020 , 23:06:42

అత్త సొమ్ము అల్లుడి దానం

అత్త సొమ్ము అల్లుడి దానం

ఎన్ని తంటాలు పడినా, మోదీజీ సర్కారు ఎన్ని ఉచిత విహారయాత్రలు ప్రత్యేకించి ఏర్పాటుచేసినా జమ్ముకశ్మీర్‌ ఈరోజు గత డబ్భై ఏండ్లలో ఎన్నడూ లేనంతగా అంతర్జాతీయ సమస్యయి కూర్చుంది. ఈ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం జరుపుతానని మోదీజీ దోస్త్‌ ట్రంప్‌ పదేపదే అంటున్నాడు, ఈ సమస్య పరిష్కారానికి తోడ్పడుతానని ఐరాస ప్రధాన కార్యదర్శి ప్రకటించాడు, టర్కీ తదితర ఇస్లామిక్‌ దేశాలు పాకిస్థాన్‌కు అండగా మోహరిస్తున్నాయి.

ఈ దేశంలో కొందరికి గాంధీజీ, ఆయన సిద్ధాంతాలు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అందువల్లనే స్వాతంత్య్రోద్యమం ఒక డ్రామా అని అంటున్నారు. గాడ్సేను దేశభక్తుడి గా ప్రశంసిస్తున్నారు. నాలుగు రోజుల కిందట ఢిల్లీలో ఒక గ్రంథావిష్కరణ సభ జరిగింది. ఆ గ్రంథం పేరు ‘గాంధీజీ కొ సమఝ్‌నే కా సహిస మయ్‌' ఈ గ్రంథ ఆవిష్కరణ సభలో ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌జీ పాల్గొని, ప్రసంగించి ఆరెస్సెస్‌ స్థాపకుడు హెగ్డెవార్‌తో గాంధీజీని పోల్చారు.ఇది సహేతుకమైన పోలిక కాదు. వీరిద్దరు సైద్ధాంతికంగా నిజానికి ఉత్తర దక్షిణాలు.


ఎవరైనా కశ్మీర్‌ వెళ్లవచ్చని, అక్కడ పరిస్థితి ప్రశాంతంగా ఉన్న దని మోదీజీ ప్రభుత్వం జోరుగా ప్రచారం చేస్తున్నది గనుక ప్రముఖుడు ఒకాయన ఢిల్లీ నుంచి శ్రీనగర్‌ వెళ్లాడు. శ్రీనగర్‌ రోడ్ల మీద, విశేషించి లాల్‌చౌక్‌ వద్ద దాదాపు రోజూ తీవ్రవాదులు దాడు లు చేస్తున్నారని, ‘ఆజాద్‌ కశ్మీర్‌' నినాదాలు తరచూ వినిపిస్తున్నాయని ఈ ప్రముఖుడికి తెలుసు. మాజీ ప్రధాని వాజపేయి ఎంతో ముద్దుగా, మురిపెంగా ఇచ్చిన ‘కశ్మీరియత్‌, జమ్‌హూరియత్‌, ఇన్సానియత్‌' నినాదాలకు కాశీలో ఘటాశ్రాద్ధం పెట్టి, తిలోదకాలిచ్చి ఏడాదైందని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని, పరిస్థితి మరింత దిగజారుతున్నదని, అటల్‌జీ కేంద్ర ప్రభుత్వంలో, విదేశ వ్యవహారాల మంత్రిత్వశాఖలో సహాయమంత్రిగా కొంతకాలం వెలిగిన ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రస్తు తం పబ్లిక్‌ సేఫ్టీ చట్టం కింద నిర్బంధంలో ఉన్నాడని కూడా ఈ ప్రముఖుడికి తెలుసు. 


అయినప్పటికీ, మోదీజీ ప్రభుత్వ ప్రచారం అబద్ధాల పుట్ట అని, పిట్టల రెట్టలకున్న విలువైనా ఆ ప్రచారానికి లేదని కొట్టేయ డం ఇష్టం కాక ఆ ప్రముఖుడు సొంత డబ్బులతో, అయాసం అనుకోకుండా అంతదూరం వెళ్లారు. కష్టమైనా ఇష్టమైనది ఆయనకు శ్రీనగర్‌ ప్రయాణం. ప్రపంచం గగ్గోలును పట్టించుకోకుండా ఆయన కశ్మీర్‌ స్థితిని స్వయంగా అవలోకించాలనుకున్నాడు, స్వేచ్ఛగా పదిమందిని కలిసి మాట్లాడాలనుకున్నాడు. ఏడాది నుంచి కశ్మీరులో స్వేచ్ఛ అన్నది మృగ తృష్ణ అని ఆ ప్రముఖుడు శ్రీనగర్‌లో అడుగుపెట్టగానే అర్థం చేసుకున్నా డు. హోటల్‌ దాటి ఎక్కడికి వెళ్లవద్దని సెక్యూరిటీ అధికారులు గట్టిగా చెప్పారు. కనీసం ఆ హోటల్‌ బాయ్స్‌తో మాట్లాడే అవకాశమైనా ఆ ప్రముఖుడికి లభించలేదు. 


‘జాతీయ ప్రయోజనాలకు, జాతీయ భద్రతకు’ ప్రమాదం కలిగించే ఏ పనులు చేయవద్దని ఆయన గది ఎదుట సహస్రాక్షుడై కాపలా ఉన్న ఓ పోలీసు పిస్టల్‌ మీద వేళ్లు తిప్పుతూ మరోసారి హెచ్చరించాడు. హోటల్‌ బాయ్స్‌తో మాట్లాడితే ‘జాతీయ ప్రయోజనాలకు, జాతీయ భద్రతకు’ భంగం కలుగుతుందా అని ఆ ప్రముఖు డు తనను తానే ప్రశ్నించుకున్నాడు. ఆ ప్రముఖుడు మాజీ కేంద్రమం త్రి, జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో కీలక పదవులు నిర్వహించి నవాడు. ప్రస్తుతం ఆ ప్రముఖుడు ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌. ఈరోజు జాతీయ ప్రయోజనాల గురించి పాఠాలు చెప్పించుకోవల్సిన దుస్థితి ఏర్పడినందుకు చాలా బాధపడ్డాడు. ‘త్వరలో కోట్లాది రూపాయల విలువైన అయోధ్య రామాలయంలోకి వేంచేయనున్న రామచంద్రా ఇదేమిటీ దుర్గతి’ అంటూ అమిత వేదనకు గురైనాడు.


శ్రీనగర్‌కు వచ్చిన వాళ్లందరు ఈ ప్రముఖుడి వలె ఆంక్షలకు, హద్దులకు గురికావడం లేదు. జమ్ముకశ్మీర్‌ సమస్య స్వతంత్ర భారత్‌ (ఇప్పుడిది సెక్యులర్‌, సోషలిస్ట్‌, డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ అవునో కాదో తెలియదు!) అంతర్గత సమస్య అంటూ హూంకరిస్తున్న ప్రస్తుత భారత ప్రభుత్వ రథసారథులు ఇటీవల ఈ జనవరి నుంచి ఇప్పటివరకు దాదాపు యాభై దేశాల రాయబారులను, ప్రజాప్రతినిధులను, ఉన్నత దౌత్యాధికారుల ను విశిష్ట, ఆత్మీయ అతిథులుగా శ్రీనగర్‌ తీసుకవెళ్లి (ప్రత్యేక విమానాల్లో భారత ప్రభుత్వ అతిథులుగా) అక్కడి సప్తనక్షత్ర హోటళ్లలో, విలాస భవనాల్లో రాచ మర్యాదలు జరిపారు. అత్యంత సాహసవంతంగా, జేమ్స్‌బాండ్‌ ఫక్కీలో, ఎవరికి అంతుపట్టకుండా 370వ, 35(ఏ)వ అధికరణాలను రద్దుచేసిన తర్వాత జమ్ముకశ్మీర్‌ ఎంత ‘ప్రశాంతంగా’ (శ్మశా న ప్రశాంతితో) ఉందో ఈ విదేశీ అతిథులకు చూపించారు. 


అక్కడి ‘జనహృదయం’ ఏ విధంగా ఉన్నదో పరికించడానికి ఈ విదేశీ అతిథులు లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో, ఉన్నత సివిలియన్‌-పోలీసు అధికారులతో, తాము ఎంపికచేసిన కొందరు దేశభక్తులైన రాజకీయ అనామకులతో సల్లాపాలు జరుపడానికి మోదీజీ ప్రభుత్వం హుటాహుటిన అన్ని ఏర్పా ట్లుచేసింది. ఇది కేవలం అంతర్గత సమస్య అయినప్పుడు, జమ్ము-కశ్మీ ర్‌లో ప్రశాంత పరిస్థితి ఏర్పడిందని, ప్రజలు హాయిగా ఉన్నారని ఇన్ని దేశాల విదేశీయులు సర్టిఫికెట్లు ఇవ్వవలసిన అవసరం ఉందా అని ‘దేశభక్తిరహితులు’ కొందరు ముక్కుల మీద వేళ్లేసుకుంటున్నారు. అంతేకాదు, భారత విదేశాంగమంత్రి, కొన్ని సమయాల్లో స్వయంగా ప్రధాని మోదీజీ విదేశాలకు వెళ్లి ‘భారత్‌ అంతర్గత సమస్య’ గురించి వివరణలు ఇస్తున్నారు. 


అంతర్గత సమస్య అయినప్పుడు, అది అంతర్జాతీయ సమ స్య కానప్పుడు ప్రాధేయపడుతూ ఇన్ని వివరణలు ఇవ్వవలసిన అవస రముందా అన్నది అసలు ప్రశ్న. కశ్మీర్‌లో, ప్రధానంగా శ్రీనగర్‌ జీలం నదిలో పడవల్లో తిరుగుతూ షికార్లు చేయడానికి, ఉన్న రెండు మూడురోజులు అక్కడ అత్యంత విలాసవంత జీవితం గడుపడానికి, ప్రత్యేక విమానాల్లో పర్యటించడానికి ఈ యాభై దేశాల గౌరవ అతిథులపై ఎంత వ్యయం జరిగిందని (కశ్మీర్‌ సామాన్య ప్రజలు వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించిన డబ్బు నుంచి) ప్రశ్నిస్తే ‘జాతీయ ప్రయోజనాల కు, భద్రతకు’ విఘాతం కలుగుతుందని అంటారు. చెమటోడ్చి, పడవ లు నడిపి, టూరిజంను ఒక పరిశ్రమగా పెంచి పోషించి, తోటల్లో ఆపిల్‌ పండ్లు పండించి కశ్మీర్‌ అట్టడుగు ప్రజలు ప్రభుత్వ బొక్కసం నింపితే ఇదీ పాలకుల ఖర్చు-ఆ ప్రజల గొంతు నొక్కడానికి. 


అందుకే అంటారు-అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు అని. ప్రశ్నించడానికి, నిరసించడానికి, ధిక్కరించడానికి అవకాశం లేని ప్రజాస్వామ్య వ్యవస్థ రూపొందుతున్నది. వందేండ్ల కిందట బ్రిటిష్‌ పాలనలో ఈ దేశప్రజలు అనుభవించిన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఈ రోజు స్వతంత్ర భారత్‌లో మృగ్యం కావడం ఘోర పరిణామం! 1919లో, గాంధీజీ రాజ్యాంగ పరిధిని అధిగమించి రౌలట్‌ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపడానికి దేశమంత టా సత్యాగ్రహం జరుపాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశమంత టా లక్షలాదిమంది గాంధీజీ పిలుపు విని సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1919 ఏప్రిల్‌ 13వ తేదీన అమృత్‌సర్‌ జలియన్‌వాలాబాగ్‌లో జనరల్‌ డయ్యర్‌ మెషిన్‌గన్‌ కాల్పుల్లో, కేవలం పది నిమిషాల్లో వందలమంది ప్రాణాలు కోల్పోయారు. 


ఈ రోజు, వందేండ్ల అనంతరం, స్వతంత్ర భారత్‌లో ఇటీవలి 370వ ఆర్టికల్‌ రద్దును, లేక నిర్వీర్యతను, పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ప్రశ్నించడానికి వీల్లేదు. నాడు జలియన్‌వాలాబాగ్‌లో జనరల్‌ డయ్యర్‌ మెషిన్‌గన్‌ పేల్చినట్లు నేడు ఢిల్లీ షాహీన్‌బాగ్‌లో ఓ రాత్రి (జామియా మిలియా ఇస్లామియా గ్రంథాలయంలో నడిరాత్రి పోలీసులు దాడి జరిపినట్లు) సాయుధ బలగాలు ప్రవేశించి దాడి జరిపితే ఆశ్చర్యపడవద్దు. ఎన్ని తంటాలు పడినా, మోదీజీ సర్కారు ఎన్ని ఉచిత విహారయాత్రలు ప్రత్యేకించి ఏర్పాటుచేసినా జమ్ముకశ్మీర్‌ ఈ రోజు గత డబ్భై ఏండ్లలో ఎన్నడూ లేనంతగా అంతర్జాతీయ సమస్య యి కూర్చుంది. ఈ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం జరుపుతానని మోదీజీ దోస్త్‌ ట్రంప్‌ పదేపదే అంటున్నాడు, ఈ సమస్య పరిష్కారానికి తోడ్పడుతానని ఐరాస ప్రధాన కార్యదర్శి ప్రకటించాడు, టర్కీ తదితర ఇస్లామిక్‌ దేశాలు పాకిస్థాన్‌కు అండగా మోహరిస్తున్నాయి.


అహింసామూర్తి, భారత జాతిపిత గాంధీజీ మహాత్ముడని సకల ప్రపంచం వందేండ్ల కిందటనే గుర్తించింది. ఈ దేశంలో కొందరికి గాంధీ జీ, ఆయన సిద్ధాంతాలు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అందువల్లనే స్వాతంత్య్రోద్యమం ఒక డ్రామా అని అంటున్నారు. గాడ్సేను దేశభక్తుడి గా ప్రశంసిస్తున్నారు. నాలుగు రోజుల కిందట ఢిల్లీలో ఒక గ్రంథావిష్కరణ సభ జరిగింది. ఆ గ్రంథం పేరు ‘గాంధీజీ కొ సమఝ్‌నే కా సహిస మయ్‌' ఈ గ్రంథ ఆవిష్కరణ సభలో ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌జీ పాల్గొని, ప్రసంగించి ఆరెస్సెస్‌ స్థాపకుడు హెగ్డెవార్‌తో గాంధీజీని పోల్చారు. ఇది సహేతుకమైన పోలిక కాదు. వీరిద్దరు సైద్ధాంతికంగా నిజానికి ఉత్తర దక్షిణాలు. వీళ్లు ఇవాళ్లయినా, రేపయినా గాంధీజీని అర్థం చేసుకోలేరనిపిస్తున్నది. ‘గాంధీజీ కట్టర్‌ హిందువు’ (కరడుగట్టిన హిం దువు) అని భగవత్‌జీ ఈ సభలో అన్నారు. తనకు, తన సిద్ధాంతాలకు ఈ విధంగా వక్రభాష్యాలు చెప్పేవారు కొందరుంటారని గాంధీజీ నాడే ఊహించి వాళ్లకు సమాధానంగా ఈ మాటలన్నారు... 


My claim to Hinduism hasbeen rejected by some, because I beli -eve and advocate non-violence in its extreme form. They say that I am a Christian in disguise.. my religion is a matter solely between my maker and myself... I do however suggest non-violence is the end of all reli -gions.... Ahimsa is in Hinduism, it is in Christianity and Islam.. చౌరీచౌరాలో హింస జరిగిందని, రౌలట్‌ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం జరుగుతున్నప్పుడు జలియన్‌వాలాబాగ్‌ సామూహిక వధ జరిగిందని గాంధీజీ స్వాతంత్య్ర సమరాన్ని నిలిపివేయలేదు. తర్వాత వెంటనే 1920 ఆగస్టు 1 నుంచి మాంటెగుక్లెమ్స్‌ ఫర్డ్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా గాంధీజీ దేశమంతటా సత్యాగ్రహ పోరాటం ప్రారంభించారు. Ahimsa is one of the Worlds greatest principl -es which no power on earth can wipeout...Ahimsa is the highest ideal. It is meant for the brave, never for cowerdly... అని గాంధీజీ వివరించారు.


logo