Mahanadi | మహానదిలో మునిగిన బోటు.. మహిళ సహా ఏడుగురు మృతి
ఒడిశాలోని (Odisha) ఝార్సుగూడ జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. సుమారు 50 మంది ప్రయాణిస్తున్న ఓ పడవ ఆకస్మాత్తుగా మహానదిలో (Mahanadi) బోల్తా పడింది. దీంతో నలుగురు మరణించారు.
భునేశ్వర్: ఒడిశాలోని (Odisha) ఝార్సుగూడ జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. సుమారు 50 మంది ప్రయాణిస్తున్న ఓ పడవ ఆకస్మాత్తుగా మహానదిలో (Mahanadi) బోల్తా పడింది. దీంతో ఏడుగురు మరణించారు. ముగ్గురు పిల్లలతో సహా మరో ఏడుగురు గల్లంతయ్యారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో నలుగురు మరణించగా, ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు గల్లంతయ్యారు. మృతుల్లో ఒక మహిళ ఉన్నది. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి పొద్దుపోవడంతో గాలింపు చర్యలకు ఆటంకి ఏర్పడిందని, శనివారం ఉదయం నుంచి ఓడీఆర్ఏఎఫ్ బృందాలు గల్లంతైనవారికోసం గాలిస్తున్నాయని జిల్లా కలెక్టర్ కార్తికేయ గోయల్ చెప్పారు.
ప్రమాద ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు. నలుగురు మృతిచెందడం పట్ల విచారం వ్యక్తంచేశారు. ఆయా కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు. దీంతోపాటు రక్షించిన వారికి సరైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

